సెబీ మాజీ చీఫ్‌ మాధవికి క్లీన్‌ చిట్‌

Published on Thu, 05/29/2025 - 07:50

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ విషయంలో అనైతికంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ మాజీ చీఫ్‌ మాధవి పురి బచ్‌కు లోక్‌పాల్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆమెపై ఆరోపణలన్నీ ఊహాగానాలు, అభిప్రాయాలతో కూడుకున్నవేనని వ్యాఖ్యానించింది.

టీఎంసీ ఎంపీ మహువా మైత్రా సహా ఇతరుల ఫిర్యాదులన్నీ కూడా, అదానీ కంపెనీలను టార్గెట్‌ చేసుకుంటారని పేరొందిన ఓ షార్ట్‌సెల్లర్‌ నివేదిక ఆధారంగా చేసినవేనని పేర్కొంది. ఇవన్నీ నిరాధారమైనవేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఆదేశించడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. అదానీ గ్రూప్‌ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన నివేదికలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

వాటిపై సెబీ చైర్మన్‌ హోదాలో బచ్‌ విచారణ జరపాల్సినప్పటికీ.. అదానీ గ్రూప్‌ కుంభకోణంతో సంబంధమున్న ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌లో గతంలో ఆమెకి, ఆమె భర్తకి వాటాలు ఉన్నందున సరైన చర్యలు తీసుకోలేదంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపించింది. ఈ ప్రాతిపదికన దాఖలైన ఫిర్యాదులను లోక్‌పాల్‌ తాజాగా కొట్టివేసింది.
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)