రూ. 35 లక్షల కోట్ల విలువైన లిథియం నిక్షేపాల వేలం పాట.. ఎప్పుడంటే?

Published on Tue, 05/02/2023 - 21:42

జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లా సలాల్‌ హైమనా ప్రాంతంలో లభ్యమైన  59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలను ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వేలం వేయనున్నట్లు గనుల మంత్రిత్వ శాఖ సెక్రటరీ వివేక్ భరద్వాజ్ తెలిపారు. 

ఇటీవల గనుల శాఖకు సంబంధించిన ఓ కార్యక్రమంలో వివేక్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. లిథియం వేలంలో సలహాదారు కోసం కేంద్ర గనుల శాఖ జమ్మూ కశ్మీర్‌ పరిపాలనా విభాగానికి లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలో ఈ అంశంపై  పార్లమెంటులో చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.  

ఈ సందర్భంగా ..59 లక్షల టన్నుల లిథియంను కనుగొనడం అదృష్టంగా భావిస్తున్నాం. వాస్తవానికి మేం జమ్మూ కాశ్మీర్‌లో లభించే సున్నపురాయి కోసం అన్వేషించాం. ఇందులో భాగంగా సున్నపురాయి, బాక్సైట్, లిథియంలను గుర్తించినట్లు చెప్పారు.  

రూ.35 లక్షల కోట్లకు పైమాటే
ఈ ఏడాది ప్రారంభంలో జమ్మూకశ్మీర్‌లో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. మార్కెట్‌ అంచనా ప్రకారం..  జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించిన ఒక టన్ను లిథియం ఖరీదు రూ. 60 లక్షలు ఉండగా.. వీటి మొత్తం ఖరీదు సుమారు రూ. 35 లక్షల (అంచనా) కోట్లుపై మాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇదే లిథియం నిక్షేపాల్ని వేలం వేసేందుకు కేంద్రం సిద్ధమైంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)