Breaking News

యూపీఐ పేమెంట్స్ ఏ దేశాల్లో చేయొచ్చో తెలుసా..

Published on Sun, 02/18/2024 - 16:55

డిజిటల్ చెల్లింపులు వచ్చిన తరువాత భారతదేశంలో చిన్న కిరాణా షాపు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చేతిలో డబ్బు ఉంచుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. గత కొన్ని రోజుల ముందు వరకు యూపీఐ పేమెంట్స్ కేవలం దేశానికి మాత్రమే పరిమితమై ఉండేవి. కాగా మారుతున్న కాలంలో పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యూపీఐ పేమెంట్స్ విదేశాలకు కూడా వ్యాపించాయి.

ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అనేది విదేశాల్లో కూడా చెల్లుబాటు అవుతుండటంతో ఆయా దేశాల కరెన్సీలతోనే చెల్లింపులు జరుగుతున్నాయి. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు ప్రత్యేకించి ఆ దేశ కరెన్సీని తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు భారతదేశంలో మాత్రమే కాకుండా.. సమీప దేశమైన శ్రీలంక, భూటాన్, మారిషస్, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, నేపాల్ దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.

శ్రీలంకలో పర్యటించే భారతీయులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. మారిషస్ దేశంలో కూడా ఇండియన్స్ డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉంది. మారిషస్ వాసులకు కూడా మన దేశంలో ఆ సదుపాయం కల్పించారు, కాబట్టి వారు కూడా మనదేశంలో డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు.

ఇండియాలో కాకుండా మొదటిసారి యూపీఐ సేవలను అనుమతించిన దేశం భూటాన్. 2012 జులై 13న ఆ దేశంలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని కోసం భీమ్ యాప్ & భూటాన్ రాయల్ మానిటరీ అథారిటీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారతదేశ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి UAE, యూఏఈలోని ప్రధాన బ్యాంకు మష్రెక్‌తో కలిసి కొద్ది రోజుల క్రితం దేశంలో UPI చెల్లింపులను స్వీకరించడానికి సంబంధించి భారత ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఫ్రాన్స్ లైరా నెట్‌వర్క్‌తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే భాగస్వామ్య కుదుర్చుకున్నాయి.

ఫోన్‌పే డేటాబేస్ ప్రకారం యూపీఐ చెల్లింపులకు మద్దతు ఇచ్చే బ్యాంకుల జాబితా..

  • బ్యాంక్ ఆఫ్ బరోడా
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
  • కెనరా బ్యాంక్
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్
  • ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్
  • ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్
  • ఇండియన్ బ్యాంక్
  • ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్
  • కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్
  • పంజాబ్ & సింధ్ బ్యాంక్
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్
  • సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్
  • కాస్మోస్ బ్యాంక్
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్‌.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్‌..

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)