Breaking News

లింక్డిన్‌నూ తాకిన లేఆఫ్‌ల సెగ.. 700 మంది ఉద్యోగుల తొలగింపు!

Published on Tue, 05/09/2023 - 10:35

ఆర్ధిక ఆనిశ్చితి, డిమాండ్‌ తగ్గడం వంటి కారణాలతో చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌కు లేఆఫ్స్‌ సెగ తగిలింది. తాజాగా, 716 మందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేయగా.. అదే సంస్థ చైనా కేంద్రంగా సేవలందిస్తున్న జాబ్‌ అప్లికేషన్‌ను షట్‌డౌన్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  

లింక్డిన్‌ గత సంవత్సరంలోని ప్రతి త్రైమాసికంలో ఆదాయాన్ని గడించింది. కానీ, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌ లేఆఫ్స్‌ కొనసాగిస్తుంది. లింక్డిన్‌ దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 3.5 శాతం ఉద్యోగాల కోతలకు దారి తీసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  


చదవండి👉సుందర్‌ పిచాయ్‌పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా?

ఆరు నెలల్లో 2,70,000 మంది తొలగింపు 
గత ఆరు నెలల్లో, ప్రపంచవ్యాప్తంగా 2,70,000కి పైగా ఐటీ ఉద్యోగులు ఉపాది కోల్పోయారు. అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థ ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. కాగా, 2016లో లింక్డిన్‌ 26 బిలియన్లకు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్, ఇటీవలి కాలంలో దాదాపు 10,000 ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన విసయం తెలిసిందే 

మైక్రోసాఫ్ట్‌ సైతం 
మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 10,000 మంది ఉద్యోగులను ఫైర్‌ చేసింది. వారిలో సప్లయి చైన్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్, మెటా, గూగుల్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులపై వేటు వేశాయి. గత ఏడాది చివరి నుంచి మెటా 21,000 మందిని తొలగించింది. జనవరి 2023లో గూగుల్‌ 12,000 మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అమెజాన్‌ ఇప్పటివరకు రెండు దఫాలుగా 27,000 మందిని తొలగించడం ఆందోళనలకు దారి తీసింది. టెక్ పరిశ్రమలో చాలా మంది తొలగింపులు కంపెనీ ఆర్థిక స్థితికి కారణమని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్‌, గూగుల్‌ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే?

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)