రెండో పాలసీ ఉందని జీవిత బీమా తిరస్కరణ!

Published on Mon, 11/23/2026 - 08:50

జీవిత బీమా పాలసీదారుడు మరణించిన తర్వాత, గతంలో ఇతర కంపెనీల వద్ద తీసుకున్న పాలసీల వివరాలు వెల్లడించలేదనే సాకుతో క్లెయిమ్‌లను తిరస్కరించడం బీమా సంస్థలకు పరిపాటిగా మారింది. అయితే, పాలసీ జారీ సమయంలోనే తనిఖీ చేయాల్సిన బాధ్యతను విస్మరించి ఆ తర్వాత క్లెయిమ్‌ నిరాకరించడం ముమ్మాటికీ సేవాలోపం కిందకే వస్తుందని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తేల్చిచెప్పింది.

అసలేం జరిగింది?

రాయ్‌పూర్‌కు చెందిన ఒక ప్రైవేటు సంస్థ డైరెక్టర్‌ పవన్‌ పించా 2018 సెప్టెంబర్‌ 10న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నుంచి రూ.కోటి కవరేజీతో జీవిత బీమా పాలసీ తీసుకున్నారు. 39 ఏళ్ల కాలపరిమితి గల ఈ పాలసీలో ఆయన భార్య చందా పించా రెండో బీమాదారుగా రూ.50 లక్షల రక్షణ పొందారు. ఇందుకోసం ఏటా రూ.36,969.40 ప్రీమియం చెల్లించారు. దురదృష్టవశాత్తు పాలసీ తీసుకున్న 15 నెలలకే, అంటే 2019 డిసెంబర్‌ 21న పవన్‌ ఆకస్మిక గుండెపోటుతో మరణించారు.

భర్త మరణానంతరం నామినీ అయిన చందా పించా రూ.కోటి బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోగా 2020 మార్చి 17న సంస్థ దాన్ని తిరస్కరించింది. పవన్‌ ఇతర సంస్థల్లో భారీ మొత్తాలకు తీసుకున్న పాలసీల వివరాలను ప్రపోజల్‌ ఫారంలో దాచిపెట్టారని ఆరోపించింది.

కమిషన్‌ పరిశీలనలు - తీర్పు

కంపెనీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చందా పించా రాయ్‌పూర్‌ వినియోగదారుల కమిషన్‌ అదనపు బెంచ్‌ను ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు, వైద్య నివేదికలు, పత్రాలను పరిశీలించిన కమిషన్‌ ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది.

సంస్థ బాధ్యత: పాలసీదారుడి నుంచి ప్రీమియం వసూలు చేసి పాలసీ జారీ చేసే ముందే ఇతర పాలసీల వివరాలను పరిశీలించే అవకాశం బీమా సంస్థకు ఉంటుంది. ఆ సమయంలో మిన్నకుండి, క్లెయిమ్‌ సమయంలో సాకులు చెప్పడం అన్యాయమైన వాణిజ్య పద్ధతి.

ఆధారాల లేమి: ఇతర పాలసీల ఉనికిని చూపడం తప్ప, క్లెయిమ్‌ తిరస్కరణకు తగిన బలమైన ఆధారాలను సంస్థ సమర్పించలేకపోయింది. పైగా సమాచార గోప్యతలో భార్య ప్రమేయం ఉన్నట్లు నిరూపించలేకపోయింది.

ఈ నేపథ్యంలో 45 రోజుల్లోగా చందా పించాకు రూ.కోటి బీమా మొత్తాన్ని చెల్లించాలని కమిషన్‌ ఆదేశించింది. అదనంగా మానసిక వేదనకు రూ.లక్ష, న్యాయ ఖర్చుల కింద రూ.15 వేలు (మొత్తం రూ.1.15 లక్షలు) చెల్లించాలని స్పష్టం చేసింది. గడువు దాటితే బకాయిపై ఏటా 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇన్సూరెన్స్‌ చట్టం 2015, సెక్షన్‌ 45 సవరణ ప్రకారం, పాలసీ ప్రారంభమైన లేదా పునరుద్ధరించిన తేదీ నుంచి 3 ఏళ్లు దాటిన తర్వాత ఏ కారణంతోనూ బీమా సంస్థ పాలసీని ప్రశ్నించడానికి వీల్లేదు. అయితే, మూడేళ్లలోపు మరణం సంభవిస్తే ఉద్దేశపూర్వక మోసం జరిగినట్లు నిరూపించే బాధ్యత సంస్థపైనే ఉంటుంది.

పాలసీదారులకు సూచనలు

  • పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్య సమస్యలు, ఆదాయం, వృత్తితో పాటు ఇప్పటికే ఉన్న ఇతర బీమా పాలసీల వివరాలను దాపరికం లేకుండా ప్రపోజల్‌ ఫారంలో పేర్కొనండి.

  • ప్రపోజల్‌ ఫారం కాపీ, ప్రీమియం రసీదులు, వైద్య పరీక్షల నివేదికలను భద్రపరచండి.

  • అకారణంగా క్లెయిమ్‌ తిరస్కరణకు గురైతే లిఖితపూర్వక కారణాలు కోరి, బీమా అంబుడ్స్‌మన్‌ లేదా వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019 కింద వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు.

ఇదీ చదవండి: తాగునీటిలో బ్రోమేట్.. కుకీస్‌లో నిషేధిత రంగులు!

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)