Breaking News

ఎల్‌ఐసీకి ఎలాంటి అనుచిత లబ్ధి అందడం లేదు

Published on Sat, 04/05/2025 - 06:30

న్యూఢిల్లీ: భారత బీమా మార్కెట్లో ఎల్‌ఐసీ అసమంజసమైన పోటీ ప్రయోజనం పొందుతోందంటూ యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) చేసిన ఆరోపణలను ప్రభుత్వరంగ బీమా సంస్థ తోసిపుచ్చింది. గత 25 ఏళ్లుగా పోటీతో కూడిన మార్కెట్లో 24 ప్రైవేటు బీమా కంపెనీల మాదిరే ఎల్‌ఐసీ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తుస్తోందని స్పష్టం చేసింది.

 యూఎస్‌టీఆర్‌ అభిప్రాయాలు భారత బీమా నియంత్రణలు, ఎల్‌ఐసీ పనితీరు గురించి సమగ్రంగా అర్థం చేసుకోకుండా చేసినవిగా భావిస్తున్నట్టు పేర్కొంది. ఐఆర్‌డీఏఐ, సెబీ నియంత్రణల పరిధిలో పనిచేస్తూ ప్రభుత్వం నుంచి కానీ, లేదా ఏ ఇతర నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేదని వివరించింది. భారత్‌లో ఆర్థిక సేవల విస్తృతికి, పాలసీదారుల ప్రయోజనం విషయంలో ఎల్‌ఐసీ చేసిన కృషిపై మరింత తటస్థ, వాస్తవిక ప్రశంసను తాము కోరుకుంటున్నట్టు పేర్కొంది.  

హామీని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు..  
‘‘ప్రైవేటు బీమా సంస్థల కంటే చాలా మంది కస్టమర్లు ఎల్‌ఐసీ పాలసీలనే ఎంపిక చేసుకుంటున్నారు. తద్వారా ఎల్‌ఐసీకి అనుచిత పోటీ ప్రయోజనం లభిస్తోంది’’అని అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ అయిన యూఎస్‌టీఆర్‌ తన తాజా నివేదికలో విమర్శించడం గమనార్హం. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన పాలన, సేవలు, కస్టమర్ల విశ్వాసాన్ని కొనసాగించేందుకు ఎల్‌ఐసీ కట్టుబడి ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి ప్రకటించారు. 1956లో ఎల్‌ఐసీని ఏర్పాటు చేసినప్పు డు ప్రభుత్వం కలి్పంచిన హామీ అన్నది.. జాతీయీకరణ ఆరంభ కాలంలో ప్రజా విశ్వాసాన్ని పొందడం కోసమే. అంతేకానీ దీన్ని ఎప్పుడూ మార్కెటింగ్‌ సాధనంగా ఎల్‌ఐసీ ఉపయోగించుకుని ప్రయోజనం పొందలేదని ఎల్‌ఐసీ తెలిపింది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)