Breaking News

భారీ పెట్టుబడులకు ఎల్‌ఐసీ రెడీ

Published on Mon, 08/12/2024 - 05:04

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024 –25) దేశీ స్టాక్‌ మార్కెట్‌లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ భారీగా ఇన్వెస్ట్‌ చేయనుంది. రూ. 1.3 లక్షల కోట్లను స్టాక్స్‌లో సరికొత్తగా ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో రూ. 38,000 కోట్ల పెట్టుబడులు కుమ్మరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23,300 కోట్ల విలువైన పెట్టుబడులు చేపట్టింది. 

కాగా.. ఈ క్యూ1లో ఎల్‌ఐసీ ఈక్విటీ మార్కెట్‌ పెట్టుబడులపై రూ. 15,500 కోట్ల లాభం ఆర్జించింది. ఇవి గతేడాది క్యూ4(జనవరి–మార్చి)తో పోలిస్తే 13.5 శాతం అధికంకావడం గమనార్హం. స్టాక్‌ మార్కెట్‌ కదలికలు, ధరల్లో మార్పులను నిశితంగా పరిశీలిస్తూ పెట్టుబడి అవకాశాలను వినియోగించుకుంటామని మొహంతీ తెలియజేశారు. కనీసం గతేడాది(రూ. 1.32 లక్షల కోట్లు) స్థాయిలో ఈ ఏడాది పెట్టుబడులను వెచి్చంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ జూన్‌ చివరికల్లా స్టాక్స్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు. బీమా దిగ్గజం మొత్తం 282 కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసింది. 

ఏఎంసీ జూమ్‌: జూన్‌కల్లా ఎల్‌ఐసీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 16 శాతంపైగా ఎగసి రూ. 53,58,781 కోట్లను తాకాయి. గత క్యూ1కు ఇవి రూ. 46,11,067 కోట్లు. 

క్యూ1 తీరిలా: క్యూ1లో ఎల్‌ఐసీ లాభం 10% వృద్ధితో రూ. 10,461 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1,88,749 కోట్ల నుంచి రూ. 2,10,910 కోట్లకు పెరిగింది.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)