హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలోకి ఎల్‌ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!

Published on Tue, 05/28/2024 - 21:30

ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

అందుకోసం పలు ఇన్సూరెన్స్‌ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్‌ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

ఎల్‌ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్‌ సిద్ధార్థ్‌ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్లకు కాంపోజిట్‌ లైసెన్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)