Breaking News

ఇకపై సులువుగా పీఎస్‌యూ డీలిస్టింగ్‌

Published on Wed, 09/10/2025 - 09:14

ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి స్వచ్చందంగా వైదొలగేందుకు(డీలిస్టింగ్‌) వెసులుబాటు కల్పిస్తూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వానికి 90 శాతం లేదా అంతకుమించి వాటా ఉన్న పీఎస్‌యూలను ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌ చేసేందుకు వీలు చిక్కనుంది. 

డీలిస్టింగ్‌కి మెజారిటీ సాధారణ వాటాదారులు అనుమతి పొందాల్సిన నిబంధనలను కూడా సెబీ సడలించింది. అలాగే, ఫ్లోర్‌ ధర మదింపులోనూ మార్పులకు తెరతీసింది. వెరసి ఫ్లోర్‌ ధరకంటే కనీసం 15 శాతం ప్రీమియంతో, ఫిక్స్‌డ్‌ ధర ద్వారా డీలిస్టింగ్‌కు అవకాశం ఏర్పడనుంది. ఇందుకు లావాదేవీల పరిమాణం తదితరాలను పరిగణనలోకి తీసుకోరు. ప్రభుత్వానికి 90 శాతం పైగా వాటా గల పీఎస్‌యూలకు ఈ వెసులుబాటును వర్తింపచేసేలా సెపె్టంబర్‌ 1న సెబీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, బీమా కంపెనీలను దీన్నుంచి మినహాయించింది.  

ఇన్విట్స్‌లో కనీస లాట్‌ తగ్గింపు

ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా ఐపీవోలో కేటాయించే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌) కనీస లాట్‌ పరిమాణాన్ని సెబీ తాజాగా కుదించింది. సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్‌ లాట్‌తో సమానం చేస్తూ రూ. 25 లక్షలకు తగ్గించింది. ఇందుకు నిబంధనలు సవరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ చేసే ఇన్విట్‌లకు అసెట్‌ మిక్స్‌ ఆధారంగా కనీస లాట్‌ రూ. కోటి లేదా రూ. 25 కోట్లుగా అమలవుతోంది. అయితే ఇప్పటికే అసెట్‌ మిక్స్‌తో సంబంధంలేకుండా సెబీ సెకండరీ మార్కెట్లో లాట్‌ పరిమాణాన్ని రూ. 25 లక్షలకు కుదించింది. దీంతో ఐపీవో ప్లేస్‌మెంట్‌ లాట్‌ను అలైన్‌ చేసింది.

ఇదీ చదవండి: మళ్లీ చక్కెర షేర్లు మధురం
 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)