Breaking News

కార్లకు దసరా కళ..

Published on Fri, 09/26/2025 - 10:57

అటు జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, ఇటు దసరా నవరాత్రులు ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకి బాగా కలిసొచ్చాయి. నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు కంపెనీ 75,000 పైచిలుకు వాహనాలను విక్రయించింది. చిన్న కార్లలో కొన్ని వేరియంట్ల డెలివరీ కోసం నిరీక్షించే పరిస్థితి కూడా నెలకొందని సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు.

ప్రస్తుతం రోజుకు 80,000 పైచిలుకు ఎంక్వైరీలు వస్తున్నాయని, ఇది సాధారణంగా వచ్చే 40,000–45,000 ఎంక్వైరీలకు రెట్టింపని వివరించారు. రోజుకు సుమారు 18,000 బుకింగ్స్‌ నమోదవుతున్నాయన్నారు. ‘నవరాత్రులు ప్రారంభమయ్యాక గురువారం సాయంత్రం 6 గం.ల సమయానికి 75,000 వాహన విక్రయాలు నమోదయ్యాయి. రోజు ముగిసే సరికి ఇది 80,000 యూనిట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం‘ అని పార్థో బెనర్జీ తెలిపారు. పండుగ సీజన్‌లో చిన్న కార్లపై గణనీయంగా ఆసక్తి నెలకొందని ఆయన చెప్పారు.

ఎంట్రీ లెవెల్‌ కార్ల సెగ్మెంట్‌లో దేశవ్యాప్తంగా బుకింగ్స్‌ 50 శాతం పెరిగాయని పేర్కొన్నారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు కోసం కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారని, అప్‌గ్రేడ్‌ కావడానికి ఇదే సరైన సమయమని బెనర్జీ వివరించారు. ఉత్పత్తిని ఒక్కసారిగా పెంచడానికి లేనందున బ్రెజా, డిజైర్, బాలెనో లాంటి కార్లలో కొన్ని వేరియంట్లను నాలుగైదు రోజుల తర్వాత సత్వరం సరఫరా చేసే అవకాశం ఉండదన్నారు.

ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్‌ చేస్తే చలానా!?

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)