Breaking News

ఏటా రూ.120 కోట్ల పెట్టుబడులు

Published on Sat, 09/20/2025 - 08:41

ఫ్యాషన్‌ దుస్తులు తదితర ఉత్పత్తుల విక్రయ సంస్థ లైఫ్‌స్టయిల్‌ ఇంటర్నేషనల్‌ తమ కార్యకలాపాల విస్తరణపై ఏటా రూ. 100–120 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 స్టోర్స్‌ ప్రారంభిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా సుమారు 125 స్టోర్స్‌ ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో 14 ఉన్నాయి. శుక్రవారమిక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ సీఈవో దేవ్‌ అయ్యర్‌ ఈ విషయాలు తెలిపారు.

తమ ఆదాయాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 11–12 శాతం ఉంటుందని ఆయన చెప్పారు. జీఎస్‌టీలో మార్పులతో ధరలపరంగా 6–8 శాతం మేర ప్రభావం ఉంటుందని అయ్యర్‌ చెప్పారు. జీఎస్‌టీ సంస్కరణలతో దేశీయంగా వినియోగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, డిజిటల్, కొత్త స్టోర్స్, ప్రైవేట్‌ బ్రాండ్లు మొదలైన అయిదు అంశాలపై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యాపారంలో సుమారు ఆరు శాతంగా ఉన్న డిజిటల్‌ వాటాను వచ్చే ఏడాది, రెండేళ్లలో 10–12 శాతానికి పెంచుకోనున్నామని అయ్యర్‌ చెప్పారు.

గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 5,000 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈసారి రెండంకెల స్థాయి వృద్ధి అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా మెట్రోల్లో స్టోర్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది 10–12 స్టోర్స్‌ ప్రారంభించనున్నామని అయ్యర్‌ వివరించారు. పండుగ సీజన్‌ సందర్భంగా లైఫ్‌స్టయిల్‌ ఎక్స్‌క్లూజివ్‌ దసరా కలెక్షన్‌ను సినీ నటి పూజా హెగ్డే ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్‌!
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)