Breaking News

రూ.450 కోట్ల ప్రీమియం లక్ష్యం

Published on Thu, 09/25/2025 - 08:44

టీవీఎస్‌ గ్రూప్‌ వేణు శ్రీనివాసన్, ఇన్సూరెన్స్‌ వెటరన్‌ వి.జగన్నాథన్‌ ఏర్పాటు చేసిన గెలాక్సీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ 2027 మార్చి నాటికి రూ.450 కోట్ల ప్రీమియం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రూ.40 కోట్ల ప్రీమియం ఆదాయం నమోదు చేశామని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లుగా ఉండొచ్చని కంపెనీ ఎండీ, సీఈవో జి.శ్రీనివాసన్‌ ప్రకటించారు.

‘పూర్తి రక్షణతో కూడిన మంచి ఉత్పత్తులను ఆఫర్‌ చేస్తూ, సులభతర క్లెయిమ్‌లు, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడం ద్వారా మార్కెట్‌ విస్తరణపై దృష్టి పెట్టాం. దేశంలో ఆరోగ్య సంరక్షణకు చేసే వ్యయంలో సగం మేర ఔట్‌ పేషెంట్‌ రూపంలోనే (ఓపీడీ) ఉంటోంది. కనుక గెలాక్సీ ఓపీడీ కవర్‌ ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు వీలుగా రూపొందించాం. నాలుగేళ్లలో బ్రేక్‌ఈవెన్‌ (లాభ, నష్టాల్లోని స్థితి)కు రావాలన్న లక్ష్యంతో ఉన్నాం’అని చెప్పారు.

గెలాక్సీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రస్తుతం ఎనిమిది పాలసీలను, రెండు రైడర్లను ఆఫర్‌ చేస్తుండగా, మొదటి ఏడాది 700 క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. క్లెయిమ్‌ పరిష్కారాలు సులభతరంగా ఉండేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు, ఇప్పటి వరకు 1.2 లక్షల మందికి కవరేజీ ఇచి్చనట్టు చెప్పారు. జీఎస్‌టీ రేట్లు తగ్గించడం వల్ల కస్టమర్లకు భారం తగ్గుతుందని, బీమా సంస్థలు తమ వంతుగా కొంత భారం భరించనున్నట్టు శ్రీనివాసన్‌ తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల పరిధిలో 6,000 నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో గెలాక్సీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సేవలు అందిస్తోంది.

ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు