Breaking News

ఐపీవోకు లలితా జ్యువెలరీ 

Published on Tue, 06/10/2025 - 04:37

న్యూఢిల్లీ: బంగారు ఆభరణ వర్తక దిగ్గజం లలితా జ్యువెలరీ మార్ట్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఎం.కిరణ్‌ కుమార్‌ జైన్‌ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.

 అర్హతగల సంస్థ ఉద్యోగులకు డిస్కౌంట్‌లో షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఐపీవో నిధుల్లో రూ. 1,015 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వెచ్చించనుంది.  1985లో చెన్నైలోని టీనగర్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించిన కంపెనీ 2024 డిసెంబర్‌కల్లా 56 స్టోర్లకు విస్తరించింది. తద్వారా గోల్డ్, సిల్వర్, డైమండ్‌ జ్యువెలరీ విక్రయిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో అధిక స్టోర్లు కలిగిన కంపెనీకి తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలోనూ కార్యకలాపాలున్నాయి. 2024 డిసెంబర్‌31తో ముగిసిన 9 నెలల్లో రూ.12,595 కోట్ల ఆదాయం, రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది.  
 

Videos

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

జైలర్ 2 పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)