Breaking News

‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత

Published on Sat, 12/06/2025 - 09:04

ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్‌ బ్రాండ్‌ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.

ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్‌ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్‌ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

టాటా కుటుంబంలో చేరి..
సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్‌కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని,  ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.

#

Tags : 1

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)