భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు!
Published on Tue, 09/01/2026 - 15:41
కంపెనీలలో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతున్న తరుణంలో ఐటీ, కార్పొరేట్ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతకు రెడిట్‌లోని ఒక అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ అనుభవం నిదర్శనంగా నిలిచింది. ఉద్యోగం కోల్పోయిన అనంతరం 600కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 10 కంపెనీల నుంచే తిరిగి స్పందన వచ్చిందని అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంఘటన గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను అద్దం పడుతోంది. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ కూడా నెలల తరబడి నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి ప్రధాన కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రిక్రూట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ (ఏటీఎస్) వినియోగం పెరగడంతో వేలాది రెజ్యూమెలను సాఫ్ట్వేర్లే తిరస్కరిస్తున్నాయి. కంపెనీలు బ్రాండ్ ఇమేజ్ కోసం నిజమైన ఖాళీలు లేకపోయినా ఉద్యోగ ప్రకటనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. లేఆఫ్‌ల వల్ల సీనియర్ మేనేజర్లు కూడా తక్కువ స్థాయి ఉద్యోగాలకు పోటీ పడుతుండటంతో 1-3 ఏళ్ల అనుభవం ఉన్న యువత తీవ్రంగా నష్టపోతోంది. గ్లోబల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడుతున్నారు.
మార్కెట్ సవాళ్లు
మాంద్యం భయాలు, కంపెనీల వ్యయ నియంత్రణల మధ్య ఉద్యోగ నియామకాల వేగం గణనీయంగా తగ్గింది. కొన్ని నివేదికల ప్రకారం ఒకప్పుడు ప్రతి 10 దరఖాస్తులకు ఒక కాల్ వస్తే, ఇప్పుడు అది ప్రతి 100 దరఖాస్తులకు ఒకటిగా పడిపోయింది. మాస్ అప్లికేషన్ల (బల్క్ దరఖాస్తులు) కంటే నిర్దిష్ట నెట్వర్కింగ్, రెఫరల్స్ సాధించడం, లోకల్/హైబ్రిడ్ ఉద్యోగాలపై దృష్టి పెట్టడం, ఏఐ టూల్స్ సహాయంతో రెజ్యూమెను నిరంతరం అప్డేట్ చేసుకోవడమే ప్రస్తుత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: మెస్సీ సంపద చూస్తే మతి పోవాల్సిందే!
Tags : 1