Breaking News

బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశం.. కోటక్‌ నుంచి గోల్డ్, సిల్వర్‌ ఫండ్‌

Published on Mon, 10/13/2025 - 19:59

కోటక్‌ మహీంద్రా ఏఎంసీ కొత్తగా గోల్డ్‌ సిల్వర్‌ ప్యాసివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) అక్టోబర్‌ 20తో ముగుస్తుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఇది ప్రధానంగా కోటక్‌ గోల్డ్‌ ఈటీఎఫ్ (Gold ETF), కోటక్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ (Silver ETF)యూనిట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తూ, దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం ఈ ఫండ్‌ లక్ష్యమని సంస్థ ఎండీ నీలేష్‌ షా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, పరిశ్రమల్లో వెండి వాడకం పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రెండింటి వృద్ధి ప్రయోజనాలను పొందేందుకు ఈ ఫండ్‌ అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.  

ఇన్వెస్కో ఇండియా కన్జంప్షన్‌ ఫండ్‌ 
దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా కన్జంప్షన్‌ ఫండ్‌ని (Invesco India Consumption Fund) ప్రవేశపెట్టింది ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌. ఈ ఫండ్‌ అక్టోబర్‌ 17 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. రోజువారీ సిప్‌ రూపంలో అయితే కనీసం రూ. 100, నెలవారీ అయితే రూ. 500 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు.

వినియోగం థీమ్‌తో ప్రయోజనం పొందే కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సాధనాల్లో కనీసం 80% ఇన్వెస్ట్‌ చేస్తుంది. మనీష్‌ బొద్దార్, అమిత్‌ గణాత్రా ఫండ్‌ మేనేజర్లుగా ఉంటారు. ట్యాక్స్‌ శ్లాబులు మార్చడం, జీఎస్‌టీ సంస్కరణలు మొదలైనవి వినియోగానికి మరింతగా ఊతమిస్తాయని సంస్థ సీఈవో సౌరభ్‌ నానావటి తెలిపారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)