Breaking News

పుతిన్ కారు ప్రత్యేకతలివే..

Published on Thu, 12/04/2025 - 15:59

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత అధికారిక పర్యటన కోసం భారత్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట వచ్చే అత్యంత భద్రతా ప్రమాణాలున్న కారు ‘ఆరుస్ సెనాట్’(Aurus Senat) గురించి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సందర్శన రెండు దేశాల చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ‘రష్యన్ రోల్స్-రాయిస్’గా పిలువబడే ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలను చూద్దాం.

పుతిన్ 2018 నుంచి ఉపయోగిస్తున్న ఈ సెనాట్‌ మోడల్‌ను రష్యన్ ఆటోమోటివ్ ఇంజిన్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. సోవియట్ కాలంలోని జీఐఎస్‌-110 లిమోజీన్‌ను పోలి ఉండే రెట్రో డిజైన్‌తో దీన్ని రూపొందించారు.

ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలు

  • ఆరుస్ సెనాట్ కారును ప్రధానంగా మిలిటరీ గ్రేడ్ భద్రతా వ్యవస్థల కోసం తయారు చేశారు. ఇది ప్రతి వైపు 20 మిల్లీమీటర్ల మందం గల బుల్లెట్‌ప్రూఫ్ ఆర్మర్‌ను కలిగి ఉంటుంది. ఇది కాల్పులను సమర్థవంతంగా తట్టుకోగలదు. అంతేకాకుండా దీని ఫ్లోర్, డోర్స్ బ్లాస్ట్-రెసిస్టెంట్‌గా తయారు చేశారు. గ్రెనేడ్ వంటి పేలుళ్లను కూడా తట్టుకుంటుంది.

  • ఈ కారులో అత్యవసర వ్యవస్థలు కూడా ఉన్నాయి. దీనికి అమర్చిన ప్రత్యేకమైన రన్-ఫ్లాట్ టైర్స్ కారణంగా టైర్లు పంక్చర్ అయినప్పటికీ కారు 50 కిలోమీటర్ల దూరం వరకు సురక్షితంగా ప్రయాణించగలదు. ఇంకేదైనా రసాయన లేదా గ్యాస్ దాడి జరిగినప్పుడు ప్రయాణీకులకు సురక్షితమైన గాలిని అందించడానికి ఇందులో ఆక్సిజన్ సప్లై సిస్టమ్, అగ్ని ప్రమాదం నుంచి రక్షించడానికి ఫైర్ సప్రెషన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

  • భద్రతతో పాటు ఆరుస్ సెనాట్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది అద్భుతమైన 598 హార్స్ పవర్ కలిగి ఉండి, 880 ఎన్‌ఎమ్‌ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో భారీ కారు అయినప్పటికీ కేవలం 6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

  • భద్రతా ఫీచర్లతోపాటు కారు లోపల అత్యంత లగ్జరీ, అధునాతన టెక్నాలజీతో నిండి ఉంటుంది. ఇందులో ప్లష్ లెదర్ ఇంటీరియర్ పుతిన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. హై-టెక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని విలాసవంతంగా చేస్తాయి.

ఇదీ చదవండి: 300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)