Breaking News

హై-ఎండ్‌ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్‌ రాహుల్‌ ఆస్తుల వివరాలు

Published on Tue, 04/15/2025 - 10:25

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఇందుకు తగ్గట్టుగానే క్రికెటర్ల బ్రాండింగ్‌ మార్కెట్‌ అధికంగా ఉంటుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుణ్యమా అని వారి వ్యక్తిగత సంపాదన కూడా పెరుగుతోంది. దానికితోడు కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల బ్రాండ్‌ ప్రమోషన్ల కోసం భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు. దాంతో చాలామంది క్రికెటర్లు దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే చందంతో వయసురీత్యా ఎక్కువ రోజులు క్రికెట్‌లో కొనసాగకపోవచ్చనే భావన, భవిష్యత్తుపై భరోసాను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ టీమ్‌ లక్నో సుపర్‌ జెయింట్స్‌ మాజీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆస్తుల వివరాలతోపాటు తాను ఎండార్స్‌ చేస్తున్న  బ్రాండ్‌ల సంగతుల గురించి తెలుసుకుందాం.

భారత మోస్ట్ స్టైలిష్, నిలకడైన క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా ఆకట్టుకునే ఆర్థిక పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. 2025 నాటికి ఆయన సందప నికర విలువ రూ.100 కోట్లు (సుమారు 12 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ వేతనాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యక్తిగత పెట్టుబడులు సహా పలు వనరుల నుంచి ఆయనకు సంపద సమకూరుతుంది.

  • రాహుల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గ్రేడ్-ఏ ఒప్పందంలో భాగంగా సంవత్సరానికి రూ.5 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు.

  • గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ ప్రతి సీజన్‌కు సరాసరి రూ.16 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తరఫున ఆడుతున్నారు.

  • పూమా, రెడ్ బుల్, భారత్ పే, బోట్, టాటా నెక్సాన్, బియర్డో, క్యూర్.ఫిట్, నుమి.. వంటి ప్రధాన బ్రాండ్‌లను రాహుల్ ప్రమోషన్‌ చేస్తున్నారు. ఇది అతని ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తుంది.

  • మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ మోడళ్లతో సహా హై-ఎండ్ కార్ల సేకరణతో పాటు బెంగళూరులో ఆయనకు లగ్జరీ ప్రాపర్టీలు ఉన్నాయి.

  • ముంబైలోని కార్టర్ రోడ్‌లో సుమారు రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. రాహుల్-అతియా శెట్టి దంపతులకు బెంగళూరులో విలాసవంతమైన నివాసం కూడా ఉంది.

ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్‌.. ఎందుకంటే..

  • మెటామాన్ అనే పెర్ఫ్యూమ్స్, జువెలరీ బ్రాండ్‌కు రాహుల్‌ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు. అందులో తాను పెట్టుబడి కూడా పెట్టారు.

  • అర్బన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ గల్లీ లైవ్ ఫాస్ట్‌కు రాహుల్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

  • బోల్డ్ ఫిట్ అనే అథ్లెట్‌ దుస్తుల తయారీ కంపెనీలో రాహుల్ ఇన్వెస్ట్ చేశారు.

  • రాహుల్‌ నిలకడైన గేమింగ్‌ ప్రదర్శన, నాయకత్వ బాధ్యతలు, బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల తన నికర విలువ క్రమంగా అధికమవుతోంది. భారత్‌లో క్రికెట్‌కు కమర్షియల్ అప్పీల్ పెరగడంతో రాబోయే కాలంలో తన సంపాదన మరింత పెరుగుతుందని తెలుస్తుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)