Breaking News

ఈ–కార్ట్స్‌ వ్యాపారంలోకి కైనెటిక్‌ గ్రీన్‌

Published on Fri, 07/18/2025 - 07:49

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్‌ కార్ట్‌ల విభాగంలోకి ప్రవేశించడంపై కైనెటిక్‌ గ్రీన్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గోల్ఫ్, లైఫ్‌స్టయిల్స్‌ కార్టుల తయారీ కోసం ఇటలీకి చెందిన టొనినో లాంబోర్గినితో చేతులు కలిపింది. వచ్చే దశాబ్దకాలంలో 1 బిలియన్‌ డాలర్ల పైగా టర్నోవరును లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకోసం  ఏర్పాటు చేసే కైనెటిక్‌ గ్రీన్‌ టొనినో లాంబోర్గిని (కేజీటీఎల్‌) జాయింట్‌ వెంచర్‌ సంస్థలో కైనెటిక్‌ గ్రీన్‌కి 70 శాతం, టొనినోకి 30 శాతం వాటాలు ఉంటాయి. వచ్చే పదేళ్లలో అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్‌ కార్ట్‌ వ్యాపారంలో 10% వాటాను సాధించాలని నిర్దేశించుకున్నట్లు కైనెటిక్‌ గ్రీన్‌ సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వాని తెలిపారు. అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా 25–30 మార్కెట్లలో ప్రవేశించడం ద్వారా వచ్చే అయిదేళ్లలో 300 మిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

వచ్చే ఏడాది వ్యవధిలో జాయింట్‌ వెంచర్‌ సంస్థ వివిధ మార్గాల్లో 20 మిలియన్‌ డాలర్లు సమీకరించనున్నట్లు వివరించారు. గోల్ఫ్‌ కోర్సులు, రిసార్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఎలక్ట్రిక్‌ కార్టులను వాడతారు. ఇవి 80–150 కి.మీ. రేంజితో, 10,000–14,000 డాలర్లకు లభిస్తాయి. దేశీయంగా ఏటా 1,500 యూనిట్లు అమ్ముడవుతున్నాయి.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)