Breaking News

భారత్‌కు యూఏఈ వీసా నిలిపేసిందా?

Published on Wed, 09/24/2025 - 13:33

యూఏఈ(UAE) విదేశాల నుంచి తమ దేశం వస్తున్న టూరిస్ట్‌లు, వర్కింగ్‌ వీసాదారులను తాత్కాలికంగా నిలిపేసిందని(Suspension) కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే దీనిపై యూఏఈ అధికారికంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. కథనాల్లోని వివరాల ప్రకారం.. యూఏఈ తొమ్మిది దేశాల టూరిస్ట్‌ వీసాలు, వర్కింగ్‌ వీసాల(tourist and work visas) జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ జాబితాలో భారత్‌ లేదని గమనించాలి. యూఏఈ వీసాలు నిలిపేసిన దేశాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  1. అఫ్గానిస్థాన్‌

  2. లిబియా

  3. యెమెన్

  4. సోమాలియా

  5. లెబనాన్

  6. బంగ్లాదేశ్

  7. కామెరూన్

  8. సూడాన్

  9. ఉగాండా

ఈ సస్పెన్షన్ కొత్త వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. పైన తెలిపిన దేశాల నుంచి వచ్చి ప్రస్తుతం యూఏఈలో ఉంటున్న వీసా హోల్డర్లకు ఎలాంటి సమస్య లేదు.

ఈ నిర్ణయానికి కారణం..

భద్రతా ఆందోళనలు: ఇంటెలిజెన్స్ నివేదికలు ఉగ్రవాదానికి సంబంధించిన సంభావ్య ప్రమాదాలను సూచిస్తున్నాయి.

దౌత్యపరమైన ఉద్రిక్తతలు: కొన్ని దేశాలకు యూఏఈ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది వీసా విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.

ప్రజారోగ్య ప్రోటోకాల్స్: కరోనా నియంత్రణలో ఉన్నప్పటికీ యూఏఈ కఠినమైన ఆరోగ్య పరీక్షలు, ప్రయాణ భద్రతా చర్యలను అమలు చేస్తూనే ఉంది. తక్కువ టీకా రేట్లు లేదా అస్థిరమైన ఆరోగ్య డేటా రిపోర్టింగ్ ఉన్న దేశాలు దీని వల్ల ప్రభావితం అవుతున్నాయి.

మైగ్రేషన్ మేనేజ్‌మెంట్‌: కార్మికుల రాకపోకలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి యూఏఈ తన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పునసమీక్షిస్తోంది.

ఇదీ చదవండి: హెచ్‌-1బీ వీసా నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ వేతనాలు ఇలా..

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)