Breaking News

మురిపిస్తున్న ముగింపు!

Published on Thu, 12/18/2025 - 21:20

డిసెంబర్ చివరి వారం వచ్చిందంటే చాలు.. ప్రపంచమంతా కొత్త ఉత్సాహం నిండుకుంటుంది. క్యాలెండర్ మారుతున్న వేళ, పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఈ సమయం కేవలం వేడుకలకే పరిమితం కాదు; ఇది ఒక భారీ ఆర్థిక చక్రానికి ఎనర్జీగా ఉంటుంది. నగరాల్లోని పబ్‌ కల్చర్‌ నుంచి గ్రామాల్లోని సెలబ్రేషన్స్‌ వరకు.. ఇయర్ ఎండింగ్ అనేది కోట్లాది రూపాయల వాణిజ్యానికి వేదికగా మారుతోంది.

డిసెంబర్ 31 రాత్రి.. గడియారం ముల్లు 12 గంటలు దాటకముందే దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థల గల్లా పెట్టెలు నిండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారత్‌లో పండుగ సీజన్, ఇయర్ ఎండింగ్ ఖర్చులు సుమారు 32% పెరిగాయని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. విశేషమేమిటంటే కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈవెంట్ కల్చర్ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు, పల్లెటూళ్లకు కూడా పాకింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. డిసెంబర్ ముగింపు అంటే ఒక వేడుక కాదు, అదొక భారీ వాణిజ్య జాతర!

నగరాల్లో ఈవెంట్లు - కార్పొరేట్ వాణిజ్యం

  • నగరాల్లో ఇయర్ ఎండింగ్ అంటేనే విలాసవంతమైన పార్టీలు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, స్టే-కేషన్లు(స్టేయింగ్‌+వెకేషన్స్‌ Staycations). ఇక్కడ వాణిజ్యం ప్రధానంగా వివిధ రంగాల్లో కేంద్రీకృతమై ఉంటుంది.

  • హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌లు ఒక నెల ముందే బుకింగ్‌లు ప్రారంభిస్తాయి. ఒక్కో ఎంట్రీ టికెట్ ధర సుమారు రూ.2,000 నుంచి రూ.20,000 అంత కంటే ఎక్కువే పలుకుతుంది. డీజేలు, డ్యాన్సర్లు, లైటింగ్ డెకరేటర్లకు ఈ సమయంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. 

  • నగరవాసులు ఇయర్ ఎండింగ్ కోసం గోవా, పాండిచ్చేరి, కేరళ.. వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం వల్ల ట్రావెల్ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు లాభాలను ఆర్జిస్తాయి. 

  • బట్టలు, గాడ్జెట్లు, కానుకల అమ్మకాలు పెరగనున్నాయి. ఇయర్ ఎండింగ్ సేల్ పేరుతో షాపింగ్ మాల్స్ ఇచ్చే ఆఫర్లు మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షిస్తాయి.

ఇదీ చదవండి: పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)