Breaking News

పాస్‌పోర్ట్‌ను పర్సనల్ డైరీగా మార్చేశారు.. అధికారి షాక్‌!

Published on Tue, 11/03/2026 - 20:08

పాస్‌పోర్ట్‌ అంటే విదేశీ ప్రయాణాలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన అధికారిక పత్రం. అందులో ప్రయాణ వివరాలు, వీసాలు, ఇమ్మిగ్రేషన్‌ స్టాంపులు ఉంటాయి. కానీ కేరళలో పాస్‌పోర్ట్‌ పునరుద్ధరణకు వచ్చిన ఓ వ్యక్తి బుక్‌లెట్‌ మాత్రం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అందులో ప్రయాణ వివరాల కంటే చేతిరాతతో కూడిన ఫోన్‌ నంబర్లు, సంప్రదింపు వివరాలు, వ్యక్తిగత గమనికలే ఎక్కువగా కనిపించాయి.

ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియోను @dksardana అనే యూజర్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేశారు. పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ కోసం వచ్చిన వ్యక్తి పత్రాన్ని పరిశీలించిన అధికారి అందులోని వివరాలను చూసి ఆశ్చర్యపోయినట్లు వీడియోలో పేర్కొన్నారు. సాధారణ ప్రయాణ పత్రంలా కాకుండా, ఓ జేబు డైరీలా కనిపిస్తున్న ఆ పాస్‌పోర్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు తమ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రాకముందు ముఖ్యమైన ఫోన్‌ నంబర్లు, చిరునామాలు, ఇతర వివరాలను చిన్న డైరీల్లో లేదా పుస్తకాల చివరి పేజీల్లో రాసుకునేవారని గుర్తుచేసుకుంటున్నారు. మరికొందరు పాస్‌పోర్ట్‌ను ఇలా వ్యక్తిగత నోట్స్‌ కోసం ఉపయోగించడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా (@hvgoenka) కూడా ఈ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. పాస్‌పోర్ట్‌ను వ్యక్తిగత డైరీగా మార్చేశారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారిక ప్రయాణ పత్రంలో ఇన్ని వ్యక్తిగత వివరాలు ఉండటం ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Videos

రాజమండ్రిలో జలమయమైన రోడ్లు

YSRCP నాయకుల అరెస్ట్.. పీఎస్‌కు వెళ్లిన అవినాశ్‌ రెడ్డి

ఇంటి గుమ్మం వద్ద: సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు

టీడీపీ విజయంపై జడ శ్రవణ్ స్పెషల్ వీడియో.. నవ్వులే నవ్వులు!

రెండేళ్లు వైట్ హౌస్ కు ఇక గడ్డు కాలమేనా?

మురసు తుఫాన్ తో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

కండక్టర్ ప్రవళిక మృతదేహానికి మంత్రి పొన్నం నివాళులు

ఈడీ విచారణపై అంబటి క్లారిటీ

నీ వెనుక ఎవడున్నాడని రెచ్చిపోతున్నావ్..? నాయుడుపేట సీఐపై కాకాణి ఫైర్

నువ్వు నన్ను తంతానంటావా? అసలు నువ్వు..!

Photos

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ దీపావళి పార్టీ... మెరిసిన బాలీవుడ్‌ తారలు (ఫోటోలు)

+5

ముంబై : ‘రామాయణ’ ప్రీమియర్ షో...బాలీవుడ్‌ తారలు సందడి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫోటోలు)

+5

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

+5

విజయవాడలో దంచికొట్టిన వర్షం.. రహదారులు జలమయం (ఫోటోలు)

+5

'మురసు' విధ్వంసం...ఒంగోలులో అల్లకల్లోలం (ఫోటోలు)