Breaking News

Keerthy Suresh: వామ్మో.. మహానటి ఆస్తులు అన్ని కోట్లా?

Published on Sun, 03/19/2023 - 13:25

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించిన హీరోయిన్స్‌లో కీర్తి సురేశ్‌ ఒకరు. నేను శైలజ సినిమాతో మొదలై మహానటి సినిమాతో తరువాతి తరాలు కూడా గుర్తుపెట్టుకునేంత పాపులారిటీ సంపాదించిందామె. ప్రస్తుతం నాని సరసన దసరా మూవీలో నటించింది కీర్తి.

తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కీర్తి సురేశ్‌ ఆస్తులు కూడా బాగానే కూడబెట్టింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 35 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే కీర్తి దసరా సినిమా కోసం ఏకంగా 4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: ఉద్యోగుల పాలిట అమావాస్య.. విప్రో నుంచి 120 మంది అవుట్)

కీర్తి సురేశ్‌ రిలయన్స్ ట్రెండ్స్, ఉషా ఇంటర్నేషనల్, జోస్ అలుక్కాస్ వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 15 నుంచి 30 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమెకు చెన్నైలో ఒక విలాసవంతమైన ఇల్లు, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పోష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్‌మెంట్ కూడా ఉంది.

కీర్తి సురేశ్‌ ఖరీదైన ఆస్తులలో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో BMW X7 సిరీస్‌ ఒకటి. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 1.18 కోట్ల నుండి రూ. 1.78 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్, టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి కార్లను కూడా కలిగి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)