ప్రతి ఉద్యోగికి రూ.50,000 ప్రోత్సాహకం!

Published on Thu, 11/20/2025 - 21:44

కర్ణాటకలో ఐటీ వృద్ధిని కేవలం బెంగళూరుకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీ 2025-2030ను ప్రకటించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ (BTS) 28వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఈ పాలసీని ఆవిష్కరించారు.

రాష్ట్రంలో బెంగళూరు దాటి ఇతర ప్రాంతాల్లో తమ ప్రతిభను విస్తరించే సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని అందించనుంది. కంపెనీలు నియమించే ప్రతి ఉద్యోగికి రూ.50,000 వరకు వన్-టైమ్ రీలొకేషన్ ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రోత్సాహకంలో భాగంగా బెంగళూరు నుంచి మైసూరు, మంగళూరు, హుబ్లీ-ధార్వాడ్, కలబురగి, శివమొగ్గ వంటి నగరాలకు ఉద్యోగులను తరలించే సంస్థలకు ఈ ప్రోత్సాహకం ఇస్తామని తెలిపింది.

ఈ సందర్భంగా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ..‘బెంగళూరు మినహా ఇతర నగరాల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం రూ.445 కోట్లు కేటాయించింది’ అని చెప్పారు.

డీప్‌టెక్ ఇన్నోవేషన్ హబ్‌

కొత్త ఐటీ పాలసీ 2025-30 కర్ణాటకను డీప్‌టెక్ ఇన్నోవేషన్ గమ్యస్థానంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘భారతదేశపు అతిపెద్ద ఐటీ ఆర్ అండ్ డీ, ఉత్పత్తి అభివృద్ధి కేంద్రం కర్ణాటక. రూ.3.2 లక్షల కోట్లకు పైగా విలువైన దేశ ఐటీ ఎగుమతుల్లో 42% వాటా కర్ణాటకదే. ఇది సంవత్సరానికి 27% చొప్పున పెరుగుతోంది. రాష్ట్రంలో 550 కంటే ఎక్కువ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఉన్నాయి. ఇది భారతదేశం మొత్తంలో మూడింట ఒక వంతు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 400 కంటే ఎక్కువ సంస్థలు బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి’ అన్నారు.

ఇదీ చదవండి: బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)