Breaking News

దీపావళికి ఆన్‌లైన్‌లో ఎక్కువగా కొన్నది ఏంటో తెలుసా?

Published on Tue, 11/10/2026 - 12:17

దీపావళి పండుగ సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు భారీ డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్‌లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఈసారి దీపావళికి ప్రజలు ఎక్కువగా ఆర్డర్ చేసినవి ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

దీపావళి సందర్భంగా ప్రజలు కేవలం స్వీట్లు, చిరుతిళ్లు మాత్రమే కాకుండా.. పూలు, దీపాలు, గిఫ్ట్ హ్యాంపర్ల, బంగారం, వెండి నాణేల వరకు అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశారు. ఒకప్పుడు పండుగ వస్తువుల కోసం షాపులకు వెళ్లి గంటల తరబడి కొనుగోళ్లు చేసేవారు. ఇప్పుడు మాత్రం చేతిలో మొబైల్ ఉంటే చాలు.. నచ్చిన వస్తువులను నిమిషాల్లో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఈ మార్పు ఈసారి దీపావళి అమ్మకాల గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది.

జెప్టోలో వీటికే డిమాండ్
జెప్టోలో ఈసారి గిఫ్ట్ హ్యాంపర్లకు మంచి డిమాండ్ కనిపించింది. గత ఏడాది దీపావళితో పోలిస్తే.. వీటి ఆర్డర్లు ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. అంతే కాకుండా.. 4.68 లక్షల మట్టి దీపాలను కస్టమర్లు ఆర్డర్ చేసినట్లు సమాచారం. పూలు, పూలదండల కొనుగోళ్లు కూడా రెండున్నర రెట్లు పెరిగాయి.

ఇక స్వీట్ల విషయానికి వస్తే ఎక్కువ మంది లడ్డూలను ఆర్డర్ చేయగా, మొత్తం అమ్మకాల పరంగా సోన్ పప్డీ ముందంజలో నిలిచింది. పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తులు, వాటికి సంబంధించిన యాక్సెసరీల కొనుగోళ్లు రెండింతలు పెరిగాయి. ఇక బ్యూటీ ఉత్పత్తులకు కూడా దీపావళి రోజున అత్యధిక ఆర్డర్లు వచ్చినట్లు జెప్టో వెల్లడించింది.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో..
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీపావళి పార్టీలు, వేడుకలకు అవసరమైన వస్తువుల ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 162 శాతం పెరిగాయి. స్నాక్స్, చిరుతిళ్ల కొనుగోళ్లు కూడా 42 శాతం పెరిగాయి. స్వీట్లలో కాజు కట్లీకి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత మోతీచూర్ లడ్డూ, బేసన్ లడ్డూలు ఉన్నాయి.

నవంబర్ 8న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉదయం 11:18 గంటలకు ఒక్క నిమిషంలోనే అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. దీపావళికి ముందు రోజు డైట్ కోక్ ఎక్కువగా ఆర్డర్ చేసిన నాన్-గ్రోసరీ వస్తువుగా నిలిచింది. దుస్తులు, నగలు, హెయిర్ యాక్సెసరీలు, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వస్తువుల కొనుగోళ్లు కూడా గణనీయంగా పెరిగాయి.

బంగారు నాణేలకు డిమాండ్
ఇక ధన్‌తేరస్ సందర్భంగా.. బంగారం, వెండి నాణేలకు కూడా మంచి గిరాకీ కనిపించింది. నవంబర్ 6న అర్ధరాత్రి 12 గంటల 30 సెకన్లకే హైదరాబాద్ నుంచి ఇన్‌స్టామార్ట్‌లో తొలి బంగారు నాణెం ఆర్డర్ నమోదైంది. అది పూల డిజైన్‌తో ఉన్న 24 క్యారెట్ల బంగారు నాణెం. ఆ తర్వాత కేవలం నాలుగు సెకన్లకే బెంగళూరు నుంచి వెండి నాణెం కోసం ఆర్డర్ వచ్చింది.

బంగారు నాణేల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది పూల డిజైన్లను ఎంచుకోగా, వెండి నాణేల్లో 73 శాతం మంది లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలున్న నాణేలను కొనుగోలు చేశారు. సాయంత్రం 6:38 గంటలకు ఈ కొనుగోళ్లు అత్యధికంగా జరిగాయి. ఇక ముంబైలో ఒక కస్టమర్ ఏకంగా రూ.1.11 లక్షల విలువైన బంగారు నాణేలను ఆర్డర్ చేయడం విశేషం. హైదరాబాద్‌లో 2 గ్రాముల బంగారు నాణెం, 100 గ్రాముల వెండి బార్ కలిపి రూ.52,215 విలువైన ఆర్డర్ నమోదైంది.

షాపింగ్‌ వేదికలుగా క్విక్ కామర్స్ యాప్‌లు
ఈ గణాంకాలను చూస్తే క్విక్ కామర్స్ యాప్‌ల వినియోగం ఎంతగా పెరిగిందో అర్థమవుతోంది. ఒకప్పుడు పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులకే పరిమితమైన ఈ యాప్‌లు ఇప్పుడు పండుగ షాపింగ్‌కు కూడా ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. స్వీట్లు, బహుమతులు, పూలు, దుస్తులే కాకుండా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కూడా ఇంటి వద్దకే తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా చివరి నిమిషంలో షాపింగ్ చేసే వారికి ఇవి సులభమైన మార్గంగా మారాయి. సమయం ఆదా కావడం, ఇంటి నుంచే అన్ని వస్తువులు ఆర్డర్ చేసుకునే సౌకర్యం ఉండటంతో ప్రజలు క్విక్ కామర్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో పండుగల సమయంలో భారతీయుల షాపింగ్ విధానం కూడా క్రమంగా మారుతోంది.

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)