Breaking News

నిరుద్యోగులకు జేపీమోర్గాన్ గుడ్‌న్యూస్‌

Published on Thu, 07/23/2026 - 13:00

కృత్రిమ మేధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీమోర్గాన్ చేజ్ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందకు సిద్ధంమైంది. దేశంలోని తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) విభాగాల కోసం సుమారు 1,000 మంది సాంకేతిక నిపుణులను కొత్తగా నియమించుకోవడానికి ప్రణాళికను ప్రకటించింది.

కీలక విభాగాల్లో నియామకాలు

ఈ నయా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రధానంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా పైప్‌లైన్స్ వంటి అత్యంత సంక్లిష్టమైన ప్రాధాన్యత కలిగిన సాంకేతిక రంగాలపై కేంద్రీకృతమై ఉంటుంది. అభ్యర్థుల తాజా నైపుణ్యాలను సవాలు చేసేందుకు ‘హ్యాకర్‌ర్యాంక్’ వేదిక ద్వారా కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లలో కఠినమైన పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

ఏఐ ప్రభావం ఉన్నా స్థిరంగా డిమాండ్

బ్యాంకింగ్ వ్యాపారంలోని పలు సంప్రదాయ, పునరావృత విభాగాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం కారణంగా సిబ్బంది అవసరం దాదాపు 40 శాతం వరకు తగ్గిందని జేపీమోర్గాన్ ఇటీవల ధ్రువీకరించింది. అయినా స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్, ఏఐ ఆధారిత డేటా నిపుణుల అవసరం నిరంతరం పెరుగుతోందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. భారత్ కేవలం పాతకాలపు బ్యాక్-ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ఉత్పత్తులను రూపొందించే ప్రధాన ఐటీ ఇన్నోవేషన్ హబ్‌గా మారుతుందనడానికి ఇది సాక్ష్యంగా నిలుస్తుంది.

భారత్‌లో విస్తరణ ఇలా..

ప్రస్తుతం జేపీమోర్గాన్ భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, బెంగళూరు, నోయిడా, గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది సంస్థ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఐదో వంతు. అంతేకాకుండా, ముంబైలోని పవాయ్‌లో 2029 నాటికి ఆసియాలోనే అతిపెద్దదిగా నిలవనున్న 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త​ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో 30,000 మంది కొలువుదీరనున్నారు.

ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్‌

#

Tags : 1

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)