Breaking News

లవ్‌లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్: ప్రముఖ కంపెనీ ఆఫర్

Published on Thu, 01/30/2025 - 12:03

ఉద్యోగం ఇచ్చేవాళ్లు విద్యార్హత చూస్తారు.. లేదా స్కిల్స్ చూస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం దీనికి భిన్నమైన రూల్స్ పెట్టింది. లవ్‌లో కనీస ఒకసారైనా బ్రేకప్ అయి ఉండాలని కూడా ఒక కండిషన్ పెట్టింది. ఇంతకీ ఆ జాబ్ ఏంటి? దానికి కావాల్సిన మరిన్ని అర్హతలు ఏమిటనేవి ఇక్కడ తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొంది. కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్‌షిప్‌లు, మూడు డేట్‌లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది. ఇలాంటి వారు ఆ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది.

⁠⁠కొత్త డేటింగ్ నిబంధనల సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. కొత్త వాటిని సృష్టించడానికి కూడా తగినంత ధైర్యం కలిగి ఉండాలి. ⁠⁠కనీసం 2-3 డేటింగ్ యాప్‌లను ప్రయత్నించి ఉండాలి. ఇందులో అనుభవం ఉండాలి, కానీ క్యాట్‌ఫిషింగ్‌కు తావులేదని స్పష్టం చేసింది. అవసరమైన అన్ని లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు.. ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది.

ఇదీ చదవండి: పనిగంటలపై 78 శాతం మంది అభిప్రాయమిదే..

ఇప్పుడు జాబ్ ఆఫర్ చేసిన బెంగళూరు కంపెనీలో ఉద్యోగం చేయడానికి ప్రత్యేకంగా ఎంబీఏ, ఎంసీఏ వంటివి అవసరం లేదు. ఉద్యోగానుభవం అంతకంటే అవసరం లేదు. ప్రేమ పిపాసులై, ప్రేమ భాషలో నిష్ణాతులైన వారు ఎవ్వరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అయితే జీతం గురించి ఎలాంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఉద్యోగానికి అప్లై చేసుకున్న వ్యక్తికి సంబంధించిన పూర్వాపరాలను కంపెనీ పరిశీలిస్తుంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)