Breaking News

జియోస్టార్ రిపోర్ట్‌: అహో ఐపీఎల్‌.. అన్నీ ‘ఫస్ట్‌’లే..

Published on Wed, 06/25/2025 - 19:31

టాటా ఐపీఎల్ 2025 లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సీజన్లలో ఒకటిగా నిలిచింది, అనేక రికార్డులు, పరిశ్రమ ఫస్ట్‌లతో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది. మీడియా పార్ట్నర్స్ ఆసియా (ఎంపీఏ) భాగస్వామ్యంతో ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించిన ఏపీఓఎస్ సదస్సులో జియోస్టార్ ‘టాటా ఐపీఎల్ 2025: ఎ ఇయర్ ఆఫ్ ఫస్ట్స్’ రిపోర్ట్‌ను విడుదల చేసింది.

'ఐపీఎల్ 2025 సీజన్ క్రీడలు, కథనాలు, అనుభవాలు పంచుకోవడం మధ్య గీతలను చెరిపివేసింది. ఇది కేవలం మ్యాచ్‌లను ప్రసారం చేయడం మాత్రమే కాదు - సృజనాత్మకత, సంస్కృతి, వాణిజ్యం, అభిమానుల కనెక్షన్లతో కలిసిపోయింది" అని జియోస్టార్ స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్పీరియన్స్ సీఈఓ సంజోగ్ గుప్తా అన్నారు.

నివేదిక ముఖ్యాంశాలు

  • జియోస్టార్ నెట్‌వర్క్‌లో టాటా ఐపీఎల్ 2025 మొత్తం 1.19 బిలియన్ల మొత్తం రీచ్‌ను నమోదు చేసింది.  ఇందులో  టీవీలో 537 మిలియన్లు. డిజిటల్‌లో 652 మిలియన్లు.

  • స్టార్ స్పోర్ట్స్‌లో ఐపీఎల్ వీక్షకుల్లో 47 శాతం మంది మహిళలే ఉన్నారు.

  • ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను 426 మిలియన్ల మంది వీక్షించారు. (టీవీలో 189 మిలియన్లు, డిజిటల్ లో 237 మిలియన్లు)

  • జియో హాట్‌స్టార్ 300 మిలియన్ల సబ్‌స్క్రైబర్లకు చేరుకుంది. ఆండ్రాయిడ్ లో 1.04 బిలియన్ యాప్ డౌన్ లోడ్ లు

  • కనెక్టెడ్ టీవీలో 235 మిలియన్ల రీచ్. మొబైల్ ఫోన్ల ద్వారా 41.7 కోట్ల మంది రీచ్ అయ్యారు.

  • టోర్నమెంట్ వీక్షణ సమయం 514 బిలియన్ నిమిషాలు; స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీలో 129 మిలియన్ల మంది వీక్షించారు. 840 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్.

  • వీక్షకుల్లో 30 శాతం మంది మాక్స్ వ్యూ 3.0ను ఉపయోగించగా, ప్రాంతీయ భాషా ఫీడ్ వార్షిక వృద్ధిని చూసింది: హిందీ: 31 శాతం; తెలుగు: 87 శాతం; తమిళం: 52 శాతం.

  • మొబైల్లో 44 శాతం మంది ఐపీఎల్ వీక్షకులు 'జీతో ధన్ ధనా ధన్' గేమ్‌ థ్రిల్‌ను అనుభవించారు.

  • జియోస్టార్‌లో 425 కుపైగా  ప్రకటనకర్తలు వచ్చారు. 40 ప్రత్యేక కేటగిరీల్లో 270+ నూతన ప్రకటనకర్తలే. మార్కెట్ లీడర్ల నుండి ఛాలెంజర్స్ వరకు 9 కేటగిరీలలో 32 బ్రాండ్లు నీల్సన్ థర్డ్ పార్టీ మెజర్‌మెంట్‌ను ఉపయోగించాయి.

  • 16:9లో మల్టీ క్యామ్, 360°/ వీఆర్ స్ట్రీమింగ్, మ్యాక్స్ వ్యూ 3.0, కనెక్టెడ్‌ టీవీలో వాయిస్-అసిస్టెడ్ సెర్చ్, ప్రకటనల రహిత ఫాస్ట్‌ చానెల్స్‌, ఏఐ ఆధారిత మ్యాచ్ హైలైట్స్ వంటి సరికొత్త టెక్నాలజీలను ఈ సీజన్‌లో వినియోగించారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)