Breaking News

ఇక ‘జియో ఏఐ స్టాక్’.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ముందడుగు

Published on Wed, 02/18/2026 - 18:15

కృత్రిమ మేధా (AI) రంగంలో భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో ‘నేషన్-ఫస్ట్ ఏఐ స్టాక్’ బ్లూప్రింట్‌ను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు (India AI Impact Summit) వేదికగా ‘జియో ఏఐ స్టాక్’ పేరుతో ఈ సమగ్ర, స్వదేశీ ఏఐ ఎకోసిస్టమ్ రూపకల్పనను సంస్థ వెల్లడించింది.

జియో ఇంటెలిజెన్స్‌ ప్రోగ్రామ్‌ కింద అభివృద్ధి చేస్తున్న ఈ ఏఐ స్టాక్, కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి సమగ్ర ఏఐ వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశ జనాభా పరిమాణం, భాషా వైవిధ్యం, సామాజిక-ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు
జియో ఏఐ స్టాక్‌లో ప్రధాన భాగంగా గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు, అధిక సామర్థ్య గణన వసతులు (HPC), ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లు, డెవలప్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌లు, భారతీయ భాషల ఆధారిత డేటా ఫౌండేషన్‌లు, మల్టీలింగ్వల్‌ ఇంటెలిజెన్స్‌ లేయర్, రంగాల వారీ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉంటాయని వెల్లడించింది.

ఈ డేటా సెంటర్లు పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచేలా నిర్మాణం చేయనున్నట్లు జియో తెలిపింది. దేశవ్యాప్తంగా స్థిరమైన, సుస్థిర ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించడమే లక్ష్యమని పేర్కొంది.

జియో ఏఐ స్టాక్‌ను “సార్వభౌమ ఏఐ ఎకోసిస్టమ్”గా సంస్థ అభివర్ణించింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ, డేటా పరిరక్షణ, డిజిటల్ మౌలిక వసతులు, వ్యూహాత్మక స్వయం నియంత్రణ వంటి జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానమై ఉంటుంది.

ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సూక్ష్మ-చిన్న వ్యాపారాలు, పౌర సేవలు వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించేలా ఈ వేదిక రూపుదిద్దుకుంటుందని సంస్థ పేర్కొంది.

భారతీయ భాషలకు ప్రాధాన్యం
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా వివిధ భారతీయ భాషల్లో విస్తృత డేటా సేకరణ జరుగుతోందని జియో తెలిపింది. స్థానిక భాషలను అర్థం చేసుకునే ఏఐ వ్యవస్థలు, ఫేఫ్టీ మల్టీలింగ్వల్ వాయిస్ ఏఐ సొల్యూషన్లు, వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో సహజంగా సంభాషించగలిగే ఏజెంటిక్ ప్లాట్‌ఫార్మ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)