Breaking News

సూపర్‌ సేవర్‌ ప్యాక్‌.. 98 రోజుల కొత్త రీచార్జ్‌ ప్లాన్

Published on Sat, 04/12/2025 - 15:37

దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రారంభిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రీఛార్జ్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కాస్త పొదుపైన, 98 రోజుల సరికొత్త రీచార్జ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డేటాతోపాటు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

జియో రూ.999 ప్లాన్
జియో ప్రస్తుతం తన రూ .999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్ని లోకల్, ఎస్‌టీడీ నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందింవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు.

ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ 90 రోజులపాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు ప్రస్తుత ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను, సినిమాలను, వెబ్ సిరీస్లను ఆస్వాదించవచ్చు. అలాగే ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

జియో రూ.1,049 ప్లాన్
రూ .999 ప్లాన్‌తో పాటు, దీనికి దగ్గర ఉండే రూ .1,049 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది. దీంతో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో  అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వినియోగదారులు 50 జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా పొందుతారు. ఇది కమ్యూనికేషన్‌తో పాటు  స్టోరేజ్ అవసరాలకు అనువుగా ఉంటుంది.

ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం (డిస్నీ + హాట్‌స్టార్) కు 90 రోజుల మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ5, సోనీలైవ్ యాక్సెస్ లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్  చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)