Breaking News

రోజంతా అన్‌లిమిటెడ్‌ డేటా: కేవలం రూ. 49తో..

Published on Sat, 01/18/2025 - 18:59

భారతదేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఎకనామిక్ రీఛార్జ్ ప్లాన్‌లతో మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశంలోని సుమారు 490 మిలియన్లకు పైగా వినియోగదారులకు కనెక్ట్ అయి ఉండటానికి కంపెనీ ఎప్పటికప్పుడు వినూత్నమైన లేదా సరసమైన రీఛార్జ్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 49 రూపాయలతో డేటా రీఛార్జ్ అందిస్తోంది.

రూ.49 రీఛార్జ్ ప్లాన్ వివరాలు
జియో డేటా ప్యాక్‌ కేటగిరీ కింద రూ. 49 రీఛార్జ్ ప్లాన్‌ ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత డేటా మాత్రమే లభిస్తుంది. అయితే మీరు కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలను పొందలేరు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఒక రోజు మాత్రమే. అయితే ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

రిలయన్స్ జియో అందిస్తున్న ఒక్క రోజు అపరిమిత డేటా ప్లాన్.. దాని ప్రత్యర్ధ సంస్థలైన ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (VI), బీఎస్ఎన్ఎల్ వంటి వాటిపై ఒత్తిడిని పెంచింది. కాగా జియో తన కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లాన్స్ అందించింది.

2024 జులైలో జియో తన కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా అమలులోకి వచ్చిన ప్లాన్ ధరలు.. ఉన్న ప్లాన్ ధరల కంటే 20 శాతం ఎక్కువయ్యాయి. దీంతో 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరాయి.

ఇదీ చదవండి: స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట!.. వచ్చేసింది మొబైల్ యాప్

రీఛార్జ్ ప్లాన్ ధరలు భారీగా పెరగడంతో.. చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపు తిరిగారు. ఆ తరువాత మళ్ళీ తమ యూజర్లను ఆకర్శించడానికి జియో సరికొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వచ్చినదే.. రూ. 49 డేటా ప్లాన్. ఇది ఇంటర్నెట్ బాగా వాడేవారికి ఎక్కువ ఉపయోగపడుతుంది.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)