Breaking News

ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. జియో ఫైనాన్స్‌ లిస్టింగ్‌ ఎప్పటినుంచంటే?

Published on Sat, 08/19/2023 - 07:34

ముంబై: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(జేఎఫ్‌ఎస్‌ఎల్‌) స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో సోమవారం(21న) లిస్ట్‌కానుంది. జియోఫిన్‌ పేరుతో టీ గ్రూప్‌లో షేర్లు లిస్ట్‌కానున్నట్లు బీఎస్‌ఈ తాజాగా పేర్కొంది. 

ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగాన్ని(రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌) గత నెలలో రిలయన్స్‌ ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీంతో షేరు ధరను నిర్ధారించే బాటలో డమ్మీ టికర్‌తో మూడు రోజులపాటు బీఎస్‌ఈ ట్రేడింగ్‌కు వీలు కల్పించింది కూడా. దాదాపు రూ. 262 ధర వద్ద జియో ఫైనాన్షియల్‌ స్థిరపడిన సంగతి తెలిసిందే. 

కంపెనీ మార్కెట్‌ క్యాప్‌(విలువ) రూ. 1.66 లక్షల కోట్లు(20.3 బిలియన్‌ డాలర్లు)గా నమోదైంది. వెరసి దేశీయంగా బజాజ్‌ ఫైనాన్స్‌ తదుపరి రెండో పెద్ద ఎన్‌బీఎఫ్‌సీగా నిలవనుంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో వచ్చే వారం నుంచి ట్రేడింగ్‌ షురూ కానుంది.

ట్రేడ్‌ ఫర్‌ ట్రేడ్‌ విభాగంలో 10 రోజులపాటు కంపెనీ లిస్ట్‌కానున్నట్లు బీఎస్‌ఈ తాజాగా వెల్లడించింది. జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేర్లను గత వారం తమ వాటాదారులకు రిలయన్స్‌ కేటాయించింది. వివిధ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సొల్యూషన్లు అందిస్తున్న జేఎఫ్‌ఎస్‌ఎల్‌ బీమా, డిజిటల్‌ చెల్లింపులు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనుంది. మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ ఏర్పాటుకు గత నెలలో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌రాక్‌తో చేతులు కలిపింది.    

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)