Breaking News

జియో వినియోగదారులకు ముఖేష్‌ అంబానీ శుభవార్త!

Published on Mon, 08/28/2023 - 14:39

జియో వినియోగదారులకు రిలయన్స్‌ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్‌ 19న వినాయక చవితి సందర్భంగా ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ అధికారికంగా ప్రకటించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్‌, జియో 5జీ గురించి కీలక ప్రకటన చేశారు. 

జియో ఎయిర్‌ఫైబర్‌ ఎలా పనిచేస్తుందంటే?
జియో ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్‌, హాట్‌స్పాట్‌ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ను ఆఫ్‌, ఆన్‌ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్‌లో గిగాబైట్‌ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్‌) స్పీడ్‌ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. 

ఫైబర్‌ ఆప్టికల్స్‌ వర్సెస్‌ జియో ఎయిర్‌ఫైబర్‌
సాధారణంగా బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలు ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్‌ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్‌ డివైజ్‌. దగ్గర్లోని జియో టవర్స్‌ నుంచి వీటికి సిగ్నల్స్‌ అందుతాయి. గత ఏడాది ఎయిర్‌ఫైబర్‌ గురించి జియో వీడియో ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్‌తో పిల్లలు వినియోగించే యాప్స్‌, వెబ్‌సైట్స్‌ను కుటుంబసభ్యులు కంట్రోల్‌ చేయొచ్చు. సంబంధిత వెబ్‌సైట్లను, యాప్స్‌ను ఎలాంటి టెక్నీషియన్‌ అవసరం లేకుండా బ్లాక్‌ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌తో 1.5జీబీపీఎస్‌ స్పీడ్‌ పొందవచ్చని తెలిపింది. 

జియో ఎయిర్‌ఫైబర్‌ ధర 
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్‌వర్క్‌తో పాటు జియో ఎయిర్‌ ఫైబర్‌ డివైజ్‌ గురించి ప్రస్తావించింది. తాజాగా ఆ డివైజ్‌ను ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ముఖేష్‌ అంబానీ తెలిపారు. పలు నివేదికలు.. జియో ఎయిర్‌ఫైబర్‌ ధర ఎంత ఉంటుందో ఓ అంచనా వేశాయి. వాటి ఆధారంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్‌) రూ. 2,800కి, మెష్ ఎక్స్‌టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్‌టెండర్‌ 6 మెష్‌ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్‌లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. జియో ఎయిర్‌ ఫైబర్‌ ధర ఎంతనేది అధికారంగా వెల్లడించాల్సి ఉంటుంది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)