Breaking News

తెలుగు రాష్ట్రాల్లో జియో నెట్‌వర్క్‌ సామర్ధ్యం విస్తరణ

Published on Fri, 05/21/2021 - 13:43

సాక్షి,హైదరాబాద్: వినియోగదారులకు మరింత మెరుగైన 4G సేవలను అందించేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ అంతటా 20 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను అదనంగా జోడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియోకు ప్రస్తుతం ఉన్న 40 MHz స్పెక్ట్రం లభ్యత ఇప్పుడు 50 శాతం పెరిగి 60 MHz వరకు చేరుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఇటీవల నిర్వహించిన వేలంలో,  ఏపీ టెలికాం సర్కిల్ కోసం 850MHz బ్యాండ్ లో  5 MHz ను; 1800MHz బ్యాండ్ లో 5MHz; 2300 MHz బ్యాండ్ లో 10 MHz స్పెక్ట్రమ్ ను జియో చేజిక్కించుకుంది.

ఈ అదనపు స్పెక్ట్రమ్ విస్తరణ ప్రాజెక్ట్ ను రెండు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న తన అన్ని టవర్ సైట్‌లలో జియో విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా, ఈ ప్రాంతంలోని వినియోగదారులందరికీ ఇక నుంచి మరింత మెరుగైన వేగవంతమైన 4G సేవలు అందుబాటులోకి రానున్నాయి. నెట్‌వర్క్ సామర్థ్యం 50 శాతం పెరగడంతో పాటు డేటా వేగం రెట్టింపు కానుంది. 

ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు 40% కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచే సురక్షితంగా ఆఫీస్ పనిచేసే వారికి, ఆన్లైన్ క్లాస్ లు హాజరయ్యే విద్యార్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు డేటా అవసరం మరింత ఉంది. నెట్వర్క్ సామర్ధ్యం పెరగడం వల్ల ఈ వర్గాల వారందరికీ మెరుగైన, నాణ్యమైన కనెక్టివిటీని అందించేందుకు జియో కృషి చేస్తోంది.

చదవండి: మరో సంచలన ప్రాజెక్టుకు రిలయన్స్‌ జియో శ్రీకారం

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)