Breaking News

ఇక బిస్లెరీకి బాస్‌ ఆమే...

Published on Mon, 03/20/2023 - 18:20

ప్యాకేజ్డ్‌ వాటర్‌ వ్యాపార దిగ్గజం బిస్లెరీని ఇక ఆ కంపెనీ వైస్‌ చైర్‌ పర్సన్‌ జయంతి చౌహాన్‌ నడిపించనున్నారు. బిజినెస్‌ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్‌ పడినట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌(టీసీపీఎల్‌) వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో బిస్లెరీ కంపెనీకి ఇక జయంతి చౌహాన్‌ అధిపతిగా ఉంటారని ఆమె తండ్రి సంస్థ చైర్మన్‌ రమేష్‌ చౌహాన్‌ తాజాగా తెలిపారు.

ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!

ది ఎకనామిక్ టైమ్స్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్‌ చౌహాన్ మాట్లాడుతూ.. తమ వ్యాపార సంస్థను తాము అమ్మడం లేదని, తమ కూతురు జయంతి చౌహాన్‌ ఇక మీదట సంస్థను నడిపిస్తారని చెప్పారు.

 

42 ఏళ్ల జయంతి చౌహాన్ ప్రస్తుతం ఆమె తండ్రి స్థాపించి తీర్చిదిద్దిన బిస్లెరీ కంపెనీలో వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె కంపెనీ ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పని చేస్తారు. జయంతి చౌహాన్‌ కంపెనీ వ్యాపార వ్యవహారాల్లో అప్పుడప్పుడు పాలుపంచుకుంటున్నారు. అయితే బిస్లరీ పోర్ట్‌ఫోలియోలో భాగమైన వేదిక బ్రాండ్‌పైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

టాటా సంస్కృతి, విలువలు నచ్చడంతో తాను తన వ్యాపార సంస్థ బిస్లెరీని వారికి అమ్మదలిచానని, ఇతర సంస్థలు బిస్లెరీ కొనుగోలుకు ఎంత ప్రయత్నించినా తాను పట్టించుకోలేదని రమేష్‌ చౌహాన్‌ అప్పట్లో చెప్పారు.

ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్‌ వాచ్‌!.. ఎలాగంటే... 

టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, బిస్లెరీ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు బిస్లరీ కంపెనీ వాల్యుయేషన్‌పై భిన్నాభిప్రాయాల కారణంగా అటకెక్కాయి. అయితే చర్చలు విఫలం కావడానికి వాల్యుయేషన్ కాకుండా వేరే కారణాలు ఉన్నట్లు ఎకనమిక్స్‌ టైమ్స్‌ పేర్కొంటోంది. కంపెనీ ప్రమోటర్లు భవిష్యత్తులో తమ ఆలోచనలను మార్చుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)