Breaking News

రైలు పట్టాలపై సవారీ చేసే బస్సు

Published on Wed, 11/26/2025 - 16:00

సాధారణంగా మనం ఊహించని పనులను చేసే కొన్ని వాహనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఒక వినూత్న వాహనాన్ని జపాన్‌లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV)గా రికార్డు సృష్టించింది. ఇది బస్సు మాదిరిగా సాధారణ రోడ్లపై, రైలులాగా రైల్వే ట్రాక్‌పై పరుగులు పెడుతుంది.

చిన్న బస్సు రూపంలో కనిపించే ఈ డ్యూయల్ మోడ్ వాహనం దాని డిజైన్, ప్రత్యేకతలతో వాహనదారులను ఆకర్షిస్తోంది. దీనికి ప్రత్యేకమైన పేరు లేనప్పటికీ దీని పనితీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వాహనం జపాన్‌లోని షికోకు ద్వీపంలోని కొచ్చిని టోకుషిమా మధ్య నడుస్తోంది. ఈ డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఆసా కోస్ట్ రైల్వే అనే ఒక ప్రైవేట్ పబ్లిక్ రైల్వే సంస్థ నిర్వహిస్తోంది.

15 సెకన్లలో మోడ్ ఛేంజ్‌..

ఈ వాహనం రోడ్డు మోడ్ (బస్సు) నుంచి రైలు మోడ్‌కు లేదా రైలు మోడ్‌ నుంచి రోడ్డు మోడ్‌కు చాలా త్వరగా మారగలదు. మోడ్‌ల మధ్య సెటప్‌ను మార్చుకోవడానికి డీఎంవీకి కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది.

  • ఈ వాహనం 21 మందిని మోసుకెళ్లగలదు.

  • రోడ్డుపై వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకు చేరుకోగలదు.

  • రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

ఈ డీఎంవీ జపాన్‌లో అవాకైనాన్, కైఫు, షిషికుయి, కన్నోరా, ఉమినోకి టోయో టౌన్, మిచినోకి షిషికుయి ఒన్సెన్‌ను కలుపుతూ నడుస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జీలు 200 యెన్ల నుంచి 800 యెన్ల వరకు (సుమారు రూ.100 నుంచి రూ.450) ఉంటాయి.

ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)