జేన్‌ స్ట్రీట్‌ నుంచి రూ. 4,844 కోట్లు 

Published on Tue, 07/15/2025 - 01:44

న్యూఢిల్లీ: యూఎస్‌ హెడ్జ్‌ ఫండ్‌ జేన్‌ స్ట్రీట్‌ తాజాగా సెబీ పేరున ఎస్క్రో ఖాతాలో దాదాపు రూ. 4,844 కోట్లు డిపాజిట్‌ చేసింది. దీంతో సంస్థపై విధించిన ఆంక్షలు ఎత్తివేయవలసిందిగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని అభ్యరి్థంచింది. మార్కెట్‌ మ్యానిప్యులేషన్‌ ద్వారా భారీ ఆర్జనకు తెరతీసిందన్న ఆరోపణలతో జేన్‌ స్ట్రీట్‌పై సెబీ కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రూ. 4,843.57 కోట్లు జమ చేయవలసిందిగా ఆదేశించింది.

 ఈ నేపథ్యంలో జేన్స్‌ స్ట్రీట్‌ అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఎఫ్‌అండ్‌వో, నగదు విభాగాలలో పొజిషన్లు తీసుకోవడం ద్వారా జేన్‌ స్ట్రీట్‌ ఇండెక్సులను మ్యానిప్యులేట్‌ చేసిందని, తద్వారా భారీగా సంపాదించిందని ఈ నెల 3న జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలలో సెబీ పేర్కొంది. 2023 జనవరి– 2025 మే నెల మధ్య రూ. 36,671 కోట్లు ఆర్జించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది. ఫలితంగా హెడ్జ్‌ ఫండ్‌ను మార్కెట్‌ కార్యకలాపాల నుంచి దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేసింది.

Videos

మేము కూడా పేర్లు నోట్ చేశాం బియ్యపు మధుసూదన్ రెడ్డి వార్నింగ్

మిథున్ రెడ్డి సిట్ విచారణపై ఉత్కంఠ

ఎలా నటించాలని భయపడుతున్న సల్మాన్

ఆపండి మహాప్రభో.. బాబు మాటలు వింటే నవ్వు ఆపుకోరు

మిథున్ రెడ్డి విచారణపై దేవినేని అవినాష్ రియాక్షన్

మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ఫిష్ వెంకట్

అదరగొడ్డున్న రామ్ రాసిన రొమాంటిక్ సాంగ్

విచారణపై మిథున్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Taneti Vanitha: ఇంటిపేరు గాలి.. అలాగని గాలి మాటలు మాట్లాడితే..

Jogi Ramesh: ఇక్కడున్న YSRCP కార్యకర్తలకి మాట ఇస్తున్న..

Photos

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ జాతికి అంకితం (ఫొటోలు)

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)