Breaking News

ఐటీసీ రూ.20,000 కోట్ల పెట్టుబడులు 

Published on Sat, 07/26/2025 - 06:09

కోల్‌కతా: ఐటీసీ మధ్య కాలానికి తన వ్యాపారాలపై రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకోనున్నట్టు చైర్మన్, ఎండీ సంజీవ్‌ పురి ప్రకటించారు. ఏ వ్యాపారాలపై వెచ్చించేదీ స్పష్టం చేయలేదు. ఇటీవలి కాలంలో ఎనిమిది ప్రపంచస్థాయి తయారీ కేంద్రాలపై రూ.4,500 కోట్లను ఐటీసీ ఖర్చు చేసినట్టు కంపెనీ వార్షిక సమావేశంలో వాటాదారులకు వెల్లడించారు. 

ఎఫ్‌ఎంసీజీ, ప్యాకేజింగ్, ఎగుమతులకు సంబంధించి విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులపై ఈ పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. 40 అత్యాధునిక తయారీ వసతులను నిర్మించినట్టు గుర్తు చేశారు. 250 తయారీ కేంద్రాలు, 7,500 ఎంఎస్‌ఎంఈలతో కూడిన ఐటీసీ ఎకోసిస్టమ్‌ను ఇవి బలోపేతం చేస్తాయన్నారు. ‘‘కంపెనీ వ్యాపారాలన్నింటా 90 శాతం మేర అదనపు విలువ జోడింపు చర్యలను చేపట్టాం. 

వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ ఫుడ్‌ సేవల విభాగంలోకి ప్రవేశించాం. ఇప్పటికే ఐదు పట్టణాల్లో 60 క్లౌడ్‌ కిచెన్లను ‘ఐటీసీ మాస్టర్‌ చెఫ్‌ ఆపరేషన్స్, ఆశీర్వాద్‌ సౌల్‌ క్రియేషన్స్, సన్‌ఫీస్ట్‌ బేక్డ్‌ క్రియేషన్స్, శాన్షో బ్రాండ్ల కింద ఏర్పాటు చేశాం’’అని సంజీవ్‌ పురి వివరించారు. మూడేళ్లలో ఈ వ్యాపారం ఏటా 108 శాతం వృద్ధిని చూసినట్టు చెప్పారు. గత మూడేళ్లలో 300 కొత్త ఉత్పత్తులను కంపెనీ విడుదల చేసినట్టు వాటాదారుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత బ్రాండ్లు ప్రపంచ వేదికపై సత్తా చాటాలన్నది తమ అభిమతమంటూ.. ఈ విషయంలో భారత్‌కే తొలి ప్రాధాన్యమని చెప్పారు. 

డీమెర్జర్‌పై సరైన సమయంలో నిర్ణయాలు 
ఐటీసీ ఇన్ఫోటెక్‌ సహా తన వ్యాపారాల డీమెర్జర్‌ (వేరు చేసి లిస్ట్‌ చేయడం) విషయమై ఎప్పటికప్పుడు అవకాశాలను ఐటీసీ మదింపు వేస్తుందని సంజీవ్‌ పురి తెలిపారు. పోటీ వాతావరణం, వ్యాపారం పరిపూర్ణతకు రావడం, అవకాశాలు, విలువ జోడింపు తదితర అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.   
 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)