Breaking News

ఐటీకి ముందుంది మంచి కాలం

Published on Sat, 07/26/2025 - 11:20

కొన్ని నెలలుగా ఐటీ పరిశ్రమలో చెప్పుకోదగిన లాభాలు ఉండడంలేదు. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీలు పోస్ట్‌ చేస్తోన్న ఫలితాల్లో చాలాభాగం లేఆఫ్స్‌, డిస్క్రీషనరీ వ్యయాన్ని తగ్గించుకోవడం వల్ల ఒనగూరిందే. అయితే సమీప భవిష్యత్తులో వీటిలో మార్పు రాబోతుందని అంచనాలు వెలువడుతున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా ఆధునీకరణ, మెరుగైన డిజిటల్ అనుభవాల కోసం ఐటీ కంపెనీల కస్టమర్లు వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, రిటైల్ రంగాల్లో విచక్షణాత్మక ఐటీ వ్యయం తిరిగి గాడినపడుతుందనే సంకేతాలు వస్తున్నాయి.

వ్యయాలు పెంపు

స్థూల ఆర్థిక ఒడిదుడుకులు, అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితుల మధ్య మొత్తం టెక్ బడ్జెట్లు స్తంభించాయి. సాంప్రదాయ ఐటీ కార్యకలాపాలను కంపెనీలు జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈమేరకు ఐటీ కస్టమర్‌ కంపెనీలు తమ వ్యయాన్ని పెంచుతున్నాయి. ఇది ఐటీ రంగానికి కలిసొచ్చే అంశం. వినియోగదారులు ఏఐ వాడకంవైపు మొగ్గు చూపడం కూడా ఐటీకి ఊతం ఇస్తుంది. జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రధాన యూఎస్ బ్యాంకులు ఏఐకి సంబంధించి ప్రయోగాత్మక దశలను దాటి పూర్తి స్థాయి, ఉత్పత్తి గ్రేడ్ ఏఐను వాడుతున్నాయి. ఈ పరివర్తన వ్యాపార ఫలితాలకు నేరుగా దోహదం చేస్తుంది.

ఏఐతో మేలు..

మల్టీ బిలియన్ డాలర్ల టెక్ బడ్జెట్ ఉన్న సంస్థలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గణనీయమైన వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు ఫారెస్టర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ బిశ్వజీత్ మహాపాత్ర అన్నారు. స్పష్టమైన ఉత్పాదకత లాభాల కోసం ఏఐ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. హైపర్-పర్సనలైజేషన్‌తో మెరుగైన కస్టమర్ అనుభవం చేకూరుతుందని చెప్పారు. ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఐటీ కంపెనీలకు లాభాలు తెస్తుందని చెప్పారు. ప్రముఖ సంస్థల ఐటీ వ్యయంలో 50% కంటే ఎక్కువ కృత్రిమ మేధ, డేటా ఆధునీకరణ, కస్టమర్-ఫేసింగ్ ఇన్నోవేషన్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..

పూర్తి స్థాయిలో కేటాయింపులు పెండింగ్‌..

ఐటీ కంపెనీల కస్టమర్‌ సంస్థల విచక్షణ వ్యయంలో రికవరీ ఇంకా విస్తృతంగా లేదని నిపుణులు చెబుతున్నారు. అనేక సంస్థలు ఐటీ స్పెండింగ్‌ కోసం ఇంకా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపడంలేదు. దాంతో మొత్తం టెక్ బడ్జెట్లు 2026 ఆర్థిక సంవత్సరంలో ఫ్లాట్‌గా లేదా స్వల్ప లాభాల్లో మాత్రమే పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఏఐ పుణ్యామా అని ఐటీ వ్యయంలో కొంత పురోగతి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)