Breaking News

యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లకు, ఇన్‌ఫ్లుయెన్స‌ర్లకు కేంద్రం భారీ షాక్‌!

Published on Sat, 07/01/2023 - 18:17

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు, యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లు, ఇన్‌స్టాగ్రామ్‌ కంటెంట్‌ క్రియేటర్లపై కేంద్రం దృష్టిసారించింది. ఆదాయపుపన్ను నిబంధనల్ని ఉల్లంఘించిన క్రియేటర్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రియేటర్లను, ఇన్‌ఫ్లుయెన్సర్లను కేంద్ర విభాగానికి చెందిన ఇన్‌ ట్యాక్స్‌ అధికారులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆదాయాలు, లాభాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాల్సి ఉందంటూ పీటీఐ తన కథనంలో పేర్కొంది.  

ఆ నివేదికల్ని ఊటంకిస్తూ గత వారం, కేరళకు చెందిన 10 మంది యూట్యూబ్‌ చానల్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు, సినిమా రంగానికి చెందిన ఆర్టిస్టులు, యాక్టర్స్‌లను ఐటీ అధికారులు విచారించారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌భావ‌శీలురుగా చెలామ‌ణి అవుతున్నవారు, కంటెంట్‌ క్రియేటర్లు ఊహించని విధంగా సంపాదిస్తున్నారని, కానీ ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.  

నోటీసులు జారీ  
ఇక, కేరళకు చెందిన కంటెంట్‌ క్రియేటర్ల నుంచి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ అధికారులు మరిన్ని వివరాలు రాబట్టారని, బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించేలా ప్రోత్సాహిస్తూ వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నివేదికల ప్రకారం..ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కంటెంట్ క్రియేటర్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఇందులో వారి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, చెల్లింపులు, చెల్లించని ప్రమోషన్‌లు, డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగం, ఖర్చలు, ఆయా సంస్థల నుంచి యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా చేసే ప్రకటనల రూపంలో జరిపే చెల్లింపులపై చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించారు. 

కేరళతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారిపై ఇలాంటి చర్యలే తీసుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్ల కార్యకలాపాలు నిర్వహించే సంస్థల గురించి ఆరాతీస్తున్నారు. 

కొత్త నిబంధనలు
గత ఏడాది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ (సీబీడీటీ) వ్యాపారం లేదా వృత్తిలో పొందే ప్రయోజనాలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తి ఏడాదిలో రూ. 20,000 కంటే ఎక్కువ ప్రయోజనాలు లేదా అవసరాలు తీర్చుకుంటే.. సదరు వ్యక్తి 10 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 

చదవండి👉 ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు! 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)