Breaking News

‘ఆఫీసు’ల్లో హైదరాబాద్‌ దూకుడు!

Published on Sat, 05/10/2025 - 13:45

రియల్‌ ఎస్టేట్‌లో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం కీలకమైంది. హైదరాబాద్‌ స్థిరాస్తికి ఐటీ బూస్ట్‌లా మారింది. ఐటీ ఉద్యోగులపై ఆధారపడి గృహ విక్రయాలు ఎంత జరుగుతాయో.. అంతకు రెట్టింపు స్థాయిలో ఐటీ సంస్థల లావాదేవీలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి పశ్చిమాది ప్రాంతాలకే పరిమితమైన ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) ఆఫీస్‌ స్పేస్‌.. గ్రోత్‌ ఇన్‌ డిస్పర్షన్‌(గ్రిడ్‌) పాలసీతో నగరం నలువైపులా విస్తరించింది. ఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఔటర్‌ వెంబడి ఉత్త్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్న 11 పారిశ్రామిక పార్క్‌లను ఐటీ పార్క్‌లుగా మార్చింది. దీంతో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరులో ఐటీ పార్క్‌లను నిర్మిస్తోంది. ఫలితంగా పశ్చిమం వైపు కాకుండా ఇతర ప్రాంతాలలో కొత్తగా 3.5–4 కోట్ల చ.అ. ఐటీ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుందని ఓ సంస్థ తెలిపింది.     
– సాక్షి, సిటీబ్యూరో

గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ దూసుకువెళ్తోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 9.04 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ ఉన్న హైదరాబాద్‌.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 కోట్ల చ.అ. 
మైలురాయిని దాటనుందని ఓ సంస్థ సర్వేలో తేలింది. ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ తర్వాత హైదరాబాద్‌ నాల్గో స్థానంలో నిలిచింది. కొంతకాలంగా కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్‌ వంటి ఉత్తరాది ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలలో నివాస క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాలలోని అందుబాటు గృహాలను ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు.

81 శాతం వృద్ధి రేటు.. 
కొన్నేళ్లుగా గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్లో మన నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తోంది. 2016 నుంచి 2021 వరకు పరిశీలిస్తే.. ఏకంగా 81 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం విశేషం. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇదెంతో మెరుగైన స్థానం. మన నగరం తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఆరేళ్లలో 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ విభాగంలో మన నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా.. కొత్తగా అందుబాటులోకి వచి్చన స్పేస్‌తో 25 శాతానికి పెరిగింది.  

గ్రిడ్‌ పాలసీ అమలుతో.. 
గ్రిడ్‌ పాలసీతో నగరం నలువైపులా ఐటీ విస్తరించింది. డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తోంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ, ఐటీఈఎస్‌ యూనిట్లకు యాంకర్‌ యూనిట్‌ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్‌ ప్రయోజనాల కోసం వినియోగించగా.. మిగిలిన సగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చనే వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉంది. హైటెక్‌సిటీ, గచి్చ»ౌలి ప్రాంతాలు గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. 96 శాతం స్పేస్‌ ఈ ప్రాంతాల నుంచే ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)