Breaking News

IRCTC రైల్వే టికెట్‌ బుకింగ్‌కి ఏమైంది? యూజర్ల గగ్గోలు

Published on Fri, 09/11/2026 - 11:49

రైలు టికెట్‌ బుక్‌ చేసుకోవాలనుకున్న ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్లాట్‌ఫామ్‌ శుక్రవారం ఉదయం తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ యాప్‌లోనూ టికెట్‌ బుకింగ్‌ సమయంలో పదేపదే ఎర్రర్‌లు రావడం, పేజీలు నెమ్మదిగా లోడ్‌ కావడం, బుకింగ్‌ ప్రక్రియ మధ్యలోనే విఫలం కావడం వంటి సమస్యలను పలువురు వినియోగదారులు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ముఖ్యంగా ఉదయం 8 గంటల సమయంలో బుకింగ్‌ రద్దీ పెరిగినప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా కనిపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

టికెట్‌ బుకింగ్‌ ప్రారంభించిన తర్వాత ‘Unable to Process Request’ అనే సందేశం కనిపించిందని పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. మరికొందరికి వెబ్‌సైట్‌ చాలా సేపు లోడ్‌ అవుతూనే ఉండగా.. చివరకు టికెట్‌ బుక్‌ చేసే సమయానికి సీట్లు అందుబాటులో లేకుండా పోయాయని తెలిపారు.

కొంతమంది ప్రయాణికులు ఉదయం 8 గంటల నుంచే ప్రయత్నించినప్పటికీ బుకింగ్‌ ప్రక్రియను పూర్తి చేయలేకపోయామని పేర్కొన్నారు. మరికొందరు వెబ్‌సైట్‌లో ‘System Overload’ తరహా సందేశాలు కనిపించాయని తెలిపారు. దీంతో అత్యంత కీలకమైన ప్రారంభ నిమిషాల్లోనే టికెట్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

పండుగ సీజన్‌ రద్దీ ప్రభావమేనా?

తాజా ఇబ్బందులకు అధిక ట్రాఫిక్‌ ఒక కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బలం చేకూర్చేలా భారతీయ రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్‌ వ్యవస్థ (PRS) సెప్టెంబర్‌ 7న సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆ ఒక్క రోజే 22,26,786 టికెట్లు బుక్‌ అయ్యాయి. గత రికార్డు 2025 ఆగస్టు 19న నమోదైన 20,45,272 టికెట్లు కాగా.. తాజా సంఖ్య దానికంటే దాదాపు 9 శాతం అధికం. తొలిసారిగా ఒక రోజులో బుకింగ్స్‌ 22 లక్షల మార్కును దాటాయి.

పండుగల సీజన్‌ సమీపిస్తుండటంతో సుదూర ప్రయాణాలకు రిజర్వేషన్‌ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం పీక్‌ బుకింగ్‌ సమయాల్లో భారీ సంఖ్యలో ఏకకాలిక అభ్యర్థనలు రావడం సాంకేతిక ఒత్తిడికి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే తాజా అంతరాయానికి ఇదే కారణమని ఐఆర్‌సీటీసీ అధికారికంగా ధ్రువీకరించలేదు.

కొత్త వెబ్‌సైట్‌ వచ్చినా సమస్యలు తప్పలేదా?

ఇటీవలే ఐఆర్‌సీటీసీ తన టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌ను ఆధునీకరించే ప్రక్రియను ప్రారంభించింది. జూలై 15న కొత్త వెబ్‌సైట్‌ బీటా వెర్షన్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అనవసరమైన క్యాప్చాలు, పాప్‌అప్‌లు తగ్గించడం, అన్ని తరగతుల సీట్ల లభ్యతను ఒకే చోట చూపించడం, బుకింగ్‌లో దశలను తగ్గించడం, తరచూ ప్రయాణించే వారికి ప్రయాణికుల వివరాలను సేవ్‌ చేసుకునే అవకాశం వంటి మార్పులను ఇందులో తీసుకొచ్చారు.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ రోజుకు సగటున సుమారు 14.5 లక్షల టికెట్లను నిర్వహిస్తోందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో పాత పాసింజర్‌ రిజర్వేషన్‌ ఇంజిన్‌ (PRE)ను కూడా ఆధునీకరిస్తున్నట్లు పేర్కొంది. కొత్త వెబ్‌సైట్‌ను ఈ కొత్త రిజర్వేషన్‌ ఇంజిన్‌తో అనుసంధానించడం ద్వారా పనితీరు, సామర్థ్యం మెరుగుపడుతుందని రైల్వే శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి: UPI కొత్త ఫీచర్లు.. ఫోన్‌ డేటా లేకున్నా పేమెంట్‌!

అయితే తాజా బుకింగ్‌ అంతరాయాల నేపథ్యంలో కొత్త ఇంటర్‌ఫేస్‌ మాత్రమే సరిపోదని, అధిక ట్రాఫిక్‌ను తట్టుకునే బ్యాక్‌ఎండ్‌ సామర్థ్యం కూడా కీలకమని ప్రయాణికుల అనుభవాలు సూచిస్తున్నాయి.

పూర్తి స్థాయి డౌన్‌ అయిందా?

వెబ్‌సైట్‌, యాప్‌, టికెట్‌ బుకింగ్‌ సేవలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులు గణనీయంగా పెరిగినట్లు ఆన్‌లైన్‌ ఫిర్యాదుల వేదిక ‘డౌన్‌డిటెక్టర్‌’లోనూ కనిపించింది.పెరుగుతున్న బుకింగ్‌ డిమాండ్‌ను ఐఆర్‌సీటీసీ వ్యవస్థ ఎంత సమర్థంగా నిర్వహించగలదన్నదే ప్రస్తుతం ప్రధాన ప్రశ్న. పండుగల సీజన్‌లో రిజర్వేషన్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా సాంకేతిక మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచడం ప్రయాణికులకు కీలకం.

Videos

YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్

దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్

ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....

ప్రియాంక చనిపోక ముందు రోజు... డాక్టర్ ప్రియాంక తండ్రి ఎమోషనల్ వీడియో

స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?

Advocate : నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతా... కానీ చనిపోయే ముందు

భారీగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు కొనకపోతే.. తులం ఎంతంటే?

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

జుట్టు పట్టి.. చీర లాగి.. ద్రౌపదికి జరిగిన అవమానమే మాకు జరిగింది

బంజారా హిల్స్ లో బిగ్ యాక్సిడెంట్ మహిళలకు తీవ్ర గాయాలు

Photos

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)