Breaking News

ట్రైన్ టికెట్ దొరకట్లేదా.. అసలు కారణం ఇదే!

Published on Sat, 06/06/2026 - 15:09

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు.. అవినీతి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రైల్వే టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేందుకు ఈ సన్నాహాలు చేస్తోంది.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. రైలు టికెట్లు పొందడం ప్రయాణికులకు చాలా కష్టంగా మారింది. టికెట్ బుకింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సీట్లు పూర్తవుతున్నాయని చాలామంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా బాట్స్, టౌట్స్, నకిలీ ఖాతాలు, మోసపూరిత యూజర్ ఐడీలు అని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ మూడు కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. అదనంగా మరో ఆరు కోట్ల ఖాతాలను పరిశీలన కోసం గుర్తించింది. టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా.. 4.2 లక్షల అనుమానాస్పద పీఎన్‌ఆర్‌లకు సంబంధించిన 501 ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదు చేసింది. అలాగే నకిలీ డిజిటల్ గుర్తింపులతో సంబంధం ఉన్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్‌లను కూడా బ్లాక్ చేసింది. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు టికెట్లు అందుబాటులోకి రావడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ట్రైన్ టికెట్ తొందరగా బుక్ అవ్వాలంటే?

  • మీ IRCTC ఖాతాలో ముందుగానే లాగిన్ అయి ఉండండి.
  • ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోండి.
  • వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించండి.
  • బుకింగ్ ప్రారంభ సమయానికి 5-10 నిమిషాల ముందే సిద్ధంగా ఉండండి.
  • యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోండి.
  • తత్కాల్ టికెట్ అయితే బుకింగ్ ఓపెన్ అయ్యే సమయానికే ప్రయత్నించండి.
  • ఒకేసారి అనేక బ్రౌజర్ ట్యాబ్‌లు లేదా పరికరాల్లో ప్రయత్నించవద్దు.
  • తక్కువ రద్దీ ఉన్న ప్రత్యామ్నాయ రైళ్లు, తేదీలను కూడా పరిశీలించండి.
  • బుకింగ్ పూర్తయ్యే వరకు పేజీని రిఫ్రెష్ చేయకుండా జాగ్రత్తగా కొనసాగించండి.

ఇదీ చదవండి: డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ

#

Tags : 1

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)