జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్
Breaking News
డాలర్ ఆధిపత్యానికి గండి!
Published on Wed, 03/18/2026 - 08:37
పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని కూడా వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధి కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు అమెరికా డాలర్ ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసురుతున్నాయి.
డీ-డాలరైజేషన్ వేగవంతం?
హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచంలోని 20% పైగా చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్, దానికి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు చమురు వ్యాపారాన్ని డాలర్లకు బదులు చైనా కరెన్సీ ‘యువాన్’లో జరపాలని యోచిస్తున్నాయి.
అంతర్జాతీయ వాణిజ్యంలో 80% పైగా చమురు లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఇప్పుడు యువాన్ వైపు మొగ్గు చూపడం వల్ల డాలర్‌కు ఉన్న గ్లోబల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే సురక్షితమైన కరెన్సీగా డాలర్‌ను కాకుండా ప్రత్యామ్నాయాల వైపు దేశాలు చూడటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.
భారత రూపాయిపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ కరెన్సీ మార్పుల ప్రభావం భారత రూపాయిపై ద్వంద్వ ప్రభావం చూపే అవకాశం ఉంది.
చైనా ఆధిపత్యం పెరగడం
అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో యువాన్ పట్టు సాధిస్తే అది ఆసియాలో చైనా ఆర్థిక శక్తిని మరింత పెంచుతుంది. భారత్‌కు చైనాతో సరిహద్దు వివాదాలు, వాణిజ్య పోటీ ఉన్న నేపథ్యంలో మన పొరుగు దేశం కరెన్సీ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారడం భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లావేదేవీలు సర్వసాధారణం. ఒకవేళ యువాన్ వాడకం పెరిగితే భారత్ తన చమురు దిగుమతుల కోసం యువాన్‌ను భారీగా కొనాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో యువాన్‌కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ దానికి సాపేక్షంగా తగ్గే ప్రమాదం ఉంది. దాంతో మన విదేశీ మారక నిల్వలలో డాలర్ల కంటే యువాన్ నిల్వలను ఎక్కువగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర ప్రభావిత అంశాల గురించి కింద చూద్దాం.
ఇదీ చదవండి: ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!
Tags : 1