Breaking News

ఈఎంఐతో ఐఫోన్.. కనిపించని ఆర్థిక నిజాలు!

Published on Tue, 03/10/2026 - 18:38

ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్‌ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.

ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్‌లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

నెలవారీ ఖర్చులు
ఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.

ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఎక్కువ సంపాదిస్తే
రూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్‌ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.

చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.

వన్ మంత్ రూల్
ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్‌ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.

మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)