Breaking News

టాటా ఐఫోన్‌! ఇక ఐఫోన్‌ 15 తయారీ ఇక్కడే..

Published on Tue, 05/16/2023 - 18:43

iPhone 15 Manufacturing: దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ ఐఫోన్‌లను తయారు చేయబోతోంది.  భారత్‌లో రాబోయే ఐఫోన్‌ 15 (iPhone 15), 15 ప్లస్‌ (15 Plus) ఫోన్లను తయారు చేసేందుకు యాపిల్‌ (Apple) సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా తైవాన్‌కు చెందిన ఓ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంటోంది.

ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్‌.. అన్నింటి కంటే తక్కువ ధరకే!

టాటా సంస్థ భారత్‌లో యాపిల్ కోసం నాలుగో ఐఫోన్ తయారీ భాగస్వామిగా ఉంటుందని తైవాన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ ‘ట్రెండ్‌ఫోర్స్’ పేర్కొంది. టాటా భాగస్వామ్యంతో భారత్‌లో యాపిల్‌ మొత్తం ఐఫోన్‌లలో ఎంత శాతం ఉత్పత్తి చేయనుందో కచ్చితంగా తెలియదు. యాపిల్‌కు భారత్‌లో ఇప్పటికే విస్ట్రాన్, ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ అనే మూడు తయారీ భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. అదే విధంగా భారత్‌లో రెండు రిటైల్‌ స్టోర్‌లను యాపిల్‌ ప్రారంభించింది.

టాటా గ్రూప్‌పై యాపిల్‌ దృష్టి
ట్రెండ్‌ఫోర్స్‌ నివేదిక ప్రకారం.. ఐఫోన్‌ల తయారీ కోసం భారత్‌లోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటిగా ఉన్న టాటా గ్రూప్‌పై యాపిల్‌ దృష్టి సారిస్తోంది. ఇది నిజమైతే ఐఫోన్ 15 తొలి షిప్‌మెంట్‌లు మొదట భారత్‌లోనే అందుతాయి. సాధారణంగా  ఐఫోన్‌లు భారత్‌లోకి ఆలస్యంగా వస్తాయి. ఇక భారత్‌లోనే తయారైతే ఐఫోన్ 15 సిరీస్ ధరలు కూడా తక్కువ ఉండేందుకు దోహదం చేస్తుంది.

దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో ఉనికిని విస్తరించాలని చూస్తున్న టాటా గ్రూప్‌నకు ఇది గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కోవిడ్ పరిమితులు, సప్లయి చైన్‌ సమస్యల కారణంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు యాపిల్‌ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇటీవలి కాలంలో దాని తయారీ స్థావరాలను విస్తరించాలని చూస్తోంది. కంపెనీ ఇప్పటికే ఐఫోన్‌14, ఐఫోన్‌ SE, ఐఫోన్‌13లతో సహా కొన్ని ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తోంది.

ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్‌ 40 లాంచ్‌కు రెడీ..  ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)