Breaking News

రూ.61,000 కోట్ల పెట్టుబడి.. ఒడిశాలో ఐవోసీఎల్‌ నాఫ్తా ప్రాజెక్ట్‌

Published on Thu, 12/26/2024 - 14:20

భువనేశ్వర్‌: ప్రభుత్వరంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOCL) రూ.61,000 కోట్ల పెట్టుబడులతో ఒడిశాలోని పరదీప్‌లో నాఫ్తా క్రాకర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబందించి ఐవోసీఎల్, ఒడిశా (Odisha) ప్రభుత్వం మధ్య జనవరిలో జరిగే ‘ఉత్కర్ష్‌ ఒడిశా–మేక్‌ ఇన్‌ ఒడిశా 2025’ సదస్సు సందర్భంగా అవగాహన ఒప్పందం కుదరనుంది.

ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భద్రక్‌లో రూ.4,352 కోట్లతో ఏర్పాటు చేయనున్న యార్న్‌ ప్రాజెక్ట్‌కు సైతం ఇదే వేదికగా శంకుస్థాపన చేయనున్నట్టు పేర్కొంది.  ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, ఐవోసీఎల్‌ చైర్మన్‌ ఏఎస్‌ సాహ్నే మధ్య భువనేశ్వర్‌లో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపింది.

‘‘పరదీప్‌లో నాఫ్తా ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఐవోసీఎల్‌ రూ.61,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ రంగంలో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌ అవుతుంది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికీ వాటా ఉంటుంది. పన్నులకు అదనంగా, డివిడెండ్‌ రూపంలో ఆదాయం లభిస్తుంది’’అని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. భద్రక్‌లో రూ.4,352 కోట్లతో ఏర్పాటు చేయనున్న యార్న్‌ ప్రాజెక్టుతో, పెద్ద ఎత్తున వస్త్రాల తయారీ కంపెనీలు ఇక్కడకు వస్తాయని తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులతో యువకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రకటించింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)