Breaking News

బీర్‌తో నడిచే బైక్‌: మతిపోయే స్పీడ్‌, కావాలంటే వీడియో చూడండి!

Published on Fri, 05/12/2023 - 19:10

సాక్షి, ముంబై: బీర్‌తో న‌డిచే బైక్ ఎపుడైనా చూశారా? అవును బీర్‌ బైకే.. అది కూడా గంట‌కు 240 కిలోమీట‌ర్ల‌ వేగంతో ప‌రుగులు తీస్తుందట.  ప్రస్తుతం ఈ బీర్‌ బైక్‌  ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది.  అమెరికాకు చెందిన మైఖేల్స‌న్‌ బీర్‌ బైక్‌ సృష్టికర్త.

గతంలో రాకెట్‌తో న‌డిచే టాయిలెట్‌, జెట్‌తో న‌డిచే కాఫీపాట్‌ను క‌నుగొన్న మైఖేల్స‌న్‌ తాజా బీర్‌బైక్‌ను రూపొందించడం విశేషం. దీనికి సంబంధించిన వివరాలను  ఫాక్స్‌9తో షేర్‌ చేసిన అతగాడు బైక్‌లో అమ‌ర్చిన హీటింగ్ కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వ‌ర‌కూ మండిస్తుంద‌ని, దీంతో నాజిల్స్‌లో ఆవిరి జ‌న‌రేట్ అవ్వడం ద్వారా బైక్‌ పని చేస్తుందని  మైఖేల్స‌న్‌  తెలిపారు. బీరుతో నడిచే మోటార్‌సైకిల్ బ్లూమింగ్టన్‌లోని అతని గ్యారేజీలో నిర్మించారట.

ఈ బైక్ గంట‌కు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంద‌ని చెప్పాడు మైఖేల్సన్‌. గ్యాస్ ధ‌రలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇదొక వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ అని వెల్ల‌డించాడు. అంతేకాదు రెడ్ బుల్, కారిబౌ కాఫీతో సహా ఏదైనా ద్రవం కూడా తన బైక్‌ ఇంధనంగా మార్చుకోవచ్చని కూడా పేర్కొన్నాడు. తాను డ్రింక్ చేయ‌న‌ని, అందుకే దీన్ని ఇంధ‌నంగా మ‌ల‌చి మెరుగ్గా వాడుకోవాల‌ని ఆలోచించాన‌ని చెప్పుకొచ్చాడు.

రాకెట్‌మ్యాన్‌గా పేరొందిన మైఖేల్స‌న్ బీర్‌  బైక్‌ స్ధానిక కార్ షోస్‌లో టాప్‌ ప్లేస్‌ స్ధానంలో నిల‌వ‌డం విశేషం. కొన్ని ప్ర‌ద‌ర్శ‌న‌ల అనంత‌రం త‌న ఇంటిలోని మ్యూజియంలో ఈ బైక్‌ను ఉంచుతాన‌ని మైఖేల్స‌న్ తెలిపాడు. 9 నెలల క్రితం తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోను షేర్‌ చేశాడు. అతని కుమారుడు దీని గురించి సవివరమైన సమాచారం ఇచ్చాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)