Breaking News

టాటా ప్లాంట్లలో ఇంటెల్‌ చిప్‌ల తయారీ

Published on Fri, 12/12/2025 - 06:11

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇంటెల్‌ భారత మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సెమీకండక్టర్లు (చిప్‌లు) తయారీ, అసెంబ్లింగ్‌ కోసం టాటా గ్రూప్‌తో చేతులు కలిపింది. ఈ విషయాన్ని టాటా గ్రూప్‌ ప్రకటించింది. ‘‘స్థానిక మార్కెట్ల కోసం ఇంటెల్‌ ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్‌ను త్వరలో ప్రారంభం కానున్న టాటా ఎల్రక్టానిక్స్‌ ఫ్యాబ్, అండ్‌ ఓఎస్‌ఏటీ కేంద్రాల్లో నిర్వహించేందుకు, అత్యాధునిక ప్యాకేజింగ్‌పై సహకారాన్ని కూడా ఇంటెల్‌–టాటా పరిశీలించనున్నాయి’’అని టాటాగ్రూప్‌ తన ప్రకటనలో పేర్కొంది. 

అలాగే, కన్జ్యూమర్, ఎంటర్‌ప్రైజ్‌ మార్కెట్‌ కోసం ఉద్దేశించిన ఏఐ పీసీ పరిష్కారాల విస్తరణకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిపింది. టాటా గ్రూప్‌  రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులతో గుజరాత్‌లోని దొలెరాలో చిప్‌ తయారీ యూనిట్‌ను, అలాగే అసోంలో ప్యాకేజింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండడం తెలిసిందే. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంప్యూటర్‌ మార్కెట్, కృత్రిమ మేధ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్న భారత మార్కెట్‌లో వేగంగా విస్తరించేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్టు ఇంటెల్‌ కార్పొరేషన్‌ సీఈవో లిప్‌ బు టన్‌ ఈ సందర్భంగా 
పేర్కొన్నారు. 

    ‘‘ఇంటెల్‌తో ఒప్పందం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మా ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తాయి. ఇరు సంస్థలూ కలసి సెమీకండక్టర్లు, సిస్టమ్‌ సొల్యూషన్లను అందించడం ద్వారా.. భారీగా విస్తరించనున్న ఏఐ మార్కెట్‌లో గణనీయమైన వాటాను సొంతం చేసుకోగలవు’’అని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రకటించారు.
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)