Breaking News

ఇది అమలైతే.. ఇన్సూరెన్స్‌ అంత ఈజీ కాదు..

Published on Sat, 05/31/2025 - 13:45

దేశ బీమా రంగంలో భారీ మార్పు రాబోతోంది. పారదర్శకతను పెంపొందించడం, మోసాలను అరికట్టడంలో భాగంగా రిస్క్‌ అంచనా కోసం జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సిబిల్ వంటి క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థను తీసుకొచ్చేపనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కోరింగ్‌ వ్యవస్థ అమల్లోకి వస్తే ఇన్సూరెన్స్‌ తీసుకోవడం అంత సులువుగా ఉండదు. ముఖ్యంగా ఫ్రాడ్‌ హిస్టరీ ఉన్న హైరిస్క్‌ వ్యక్తులను గుర్తించేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సులభమవుతుంది.

పాలసీదారులపై ప్రభావం
బ్యాంకులు రుణ దరఖాస్తుదారులను వారి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఎలా అంచనా వేస్తాయో, బీమా ప్రొవైడర్లు కూడా దరఖాస్తుదారులను వారి గత బీమా రికార్డుల ఆధారంగా మదింపు చేస్తారు. క్లీన్ క్లెయిమ్స్ చరిత్ర ఉన్న వ్యక్తులు తక్కువ ప్రీమియంల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇక మోసపూరిత క్లెయిమ్‌లకు పాల్పడిన చరిత్ర ఉన్నవారు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. కవరేజీ తిరస్కరణను కూడా ఎదుర్కోవచ్చు.

మోసపూరిత క్లెయిమ్‌లతో రూ. వేల కోట్ల నష్టం
ప్రస్తుతం బీమా రంగంలో మోసపూరిత క్లెయిమ్‌లు ఏటా రూ.12,000-రూ.15,000 కోట్లుగా ఉన్నాయి. ఇది బీమా సంస్థలకు సవాలుగా మారింది. బీమా క్రెడిట్ స్కోర్లను అమలు చేయడం ద్వారా తప్పుడు క్లెయిమ్‌లను తగ్గించడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, మరింత ప్రీమియంలతో పాలసీలను అందించేందుకు బీమా కంపెనీలకు  వీలవుతుంది. ఇది బాధ్యతాయుతమైన పాలసీదారు ప్రవర్తనను ప్రోత్సహిస్తుందని, బీమా ఉత్పత్తులకు విస్తృత అందుబాటును నిర్ధారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

బీమా పరిశ్రమకు గేమ్ ఛేంజర్‌..
క్రెడిట్‌ స్కోరింగ్‌ వ్యవస్థ భారత బీమా పరిశ్రమకు గేమ్ ఛేంజర్‌గా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు,  గోప్యత, డేటా వినియోగానికి సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ, నియంత్రణ సంస్థలు డేటా సంరక్షణ చట్టాలను ​కచ్చితంగా పాటిస్తామని హామీ ఇస్తున్నాయి. ఇటు బీమా కంపెనీలకు, అటు పాలసీదారులకు ఇద్దరికీ   ప్రయోజనం చేకూర్చే ఈ బీమా క్రెడిట్‌ స్కోరింగ్‌ వ్యవస్థ 2026 ప్రారంభం నాటికి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)